ఒక వైపు చలి మొదలైంది ఈయనేంటి వర్షాలు వస్తాయని చెబుతున్నారు అనుకుంటున్నారా? అందులో ఇది వర్ష కాలం కూడా కాదు. ఈ లెక్కలు తప్పు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వర్షాకాలంలో వానలు రావడం సహజం. అలాంటిది ఇప్పుడు శీతాకాలంలో భారీ వర్షాలు రావడానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే కారణమట..

 

 

ఇకపోతే ఎవరూ ఊహించని విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఒకటి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాలు దానికి తోడవ్వడంతో అది చాలా చురుగ్గా మారింది, దీని వల్ల తమిళనాడులో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఒకరు చనిపోయారు కూడా. ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తిరుమలలో కూడా రెండ్రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. దీని వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వర్షంలోనే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.

 

 

ఇకపోతే చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తుండగా ఇవాళ, రేపు రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని పేర్కొంటున్నారు. ఇకపోతే తమిళనాడులో చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు..

 

 

చివరకు సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు ఇంత భారీ వర్షం కురుస్తుందని అధికారులు కూడా ముందుగా అంచనా వెయ్యలేదు. అయితే అల్పపీడన ద్రోణి క్రమంగా బలపడుతుంటే, వానల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన లేకపోయినా... అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.

 

 

ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది... ఇక ఈ పరిస్దితుల్లో ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ఇప్పుడు జల్లులతో కూడిన వర్షం అయితే పర్వాలేదు... కాని ఉరుములు, పిడుగులతో ఉంటే జాగ్రత్తగా ఉండాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: