బంగారం అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు అందులోనూ ఆడ‌వాళ్ళ‌కు మ‌రింత ఇష్టం. ఇక ఈ మ‌ధ్య అయితే ప‌సిడి ధ‌ర అమాంతం పెరిగి కొండెక్కికూర్చుంది. ఇంట్లో జ‌రిగే ఏ శుభ‌కార్యానికైనా బంగారం అనేది ముఖ్యం అందులోనూ మ‌ళ్ళీ పెళ్ళిళ్ళ సీజ‌న్ మొద‌లైంది. అంటే బంగారం త‌ప్ప‌నిస‌రి ఇక ధ‌ర‌లేమో ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ప్ర‌స్తుతం మీ అంద‌రికీ ఒక శుభ‌వార్త ప‌సిడి ధ‌ర దిగివ‌చ్చింది. బంగారం ధర గత నెల రోజుల్లో ఏకంగా రూ.600కు పైగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో నవంబర్ 2న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40,410 ఉండ‌గా, ఇప్పుడు బంగారం ధర రూ.39,770కు దిగొచ్చింది. అంటే పసిడి ధర నెల రోజుల వ్యవధిలో రూ.640 క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి కాస్త డిమాండ్ త‌గ్గ‌డంతో ఈ విధంగా త‌గ్గింద‌ని  మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

 

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.590 పడిపోయింది. నవంబర్ 2న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,050 వద్ద ఉంది. ఇప్పుడు ఈ ధర రూ.36,460కు తగ్గింది. నెల రోజుల వ్యవధిలో పసిడి రూ.590 క్షీణించింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. బంగారం ధర బాటలోనే వెండి ధ‌ర కూడా త‌గ్గుతూ వ‌చ్చింది.  వెండి ధర కేజీని నవంబర్ 1న రూ.48,500 ఉండ‌గా, ఇప్పుడు వెండి ధర రూ.46,650 కి త‌గ్గింది. నెల రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ.1850 పడిపోయింది.

 


దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. నెల రోజుల వ్యవధిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పడిపోయింది. నవంబర్ 2న పసిడి ధర రూ.39,050 వద్ద ఉంది. ఇప్పుడు ఈ ధర రూ.38,400కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.37,850 నుంచి రూ.37,200కు పడిపోయింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: