దిశ (పేరుమార్పు) పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపారు.  14 రోజులపాటు వారికీ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  అయితే, వీరిపై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు బనాయించారు.  నేరం రుజువైన వెంటనే ఆ నలుగురు నిందితులకు మరణశిక్ష విధించే విధంగా పావులు కదుపుతున్నారు.  దీనికి సంబంధించి  ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా నిన్నటి రోజున స్పందించిన సంగతి తెలిసిందే.  
ఇదిలా ఉంటె, దిశ హత్యకేసులో  లారీ డ్రైవర్ యజమాని శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యం కీలకంగా మారింది.  లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి అయన వద్ద నుంచి సాక్ష్యాలను సేకరించారు.  తోడుపల్లి టోల్ ప్లాజా దగ్గర లారీ డ్రైవర్ పాషా లారీని పార్క్ చేసినప్పటి నుంచి ఆరోజు మొత్తం ఏమేమి జరిగింది అనే విషయాలను అయన దగ్గరి నుంచి వాగ్మూలంగా తీసుకున్నారు.  
ఇలా తీసుకున్న ఆ వాగ్మూలం ఆధారంగా వారిపై కేసులు బలీయంగా పెట్టారు.  దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను కూడా రిజిస్టర్ చేసే పనిలో ఉన్నారు.  దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెడీ కాగానే ఈ నలుగురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు.   సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దీనిని కూడా కొన్ని విలువైన ఆధారాలు సేకరించారు.  అయితే, సీసీటీవీలలో ఎలాంటి విషయాలు ఉన్నాయి అన్నది బయటకు రావాల్సి ఉన్నది.  
వరంగల్ లో జూన్ 9 వ తేదీన చిన్నారిపై అత్యాచారం కేసులు నిందితుడికి 56 రోజుల్లోనే శిక్షను విధించారు.  అయితే, అది మరణ శిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మారింది.  అయితే, ఈకేసులో అలా కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.  అటు పోలీసులు కూడా ఈ కేసును సవాల్ గా తీసుకొని టేకప్ చేస్తున్నారు.  ఇక హత్య జరిగిన ముందురోజు ఆర్టీఏ అధికారులు లారీకి పదివేల రూపాయల జరిమానా వేసిన సంగతి తెలిసిందే.  అలానే ఆర్టీఏ అధికారులు వారివద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా తీసుకున్నారు.  ఆ రెండింటిని, అదే విధంగా జరిమానా లేఖను కూడా పోలీసులకు ఈరోజు అందజేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: