గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో  టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తూ పార్టీ స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు.... పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేసి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు రావాలంటూ పిలుపునిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజధాని అమరావతి లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటించారు. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత రాజధాని అమరావతి లో పర్యటించిన చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగలు తగిలాయి . చంద్రబాబు గోబ్యాక్ అంటూ రాజధాని రైతులందరూ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు కాన్వాయ్ పైకి  ఏకంగా చెప్పులు రాళ్లు విసిరారు  రాజధాని రైతులు. 

 

 

 

 ఎన్ని నిరసనలు  ఎదురైనప్పటికీ చంద్రబాబు మాత్రం రాజధాని పర్యటనకు ముందుకు వెళ్లారు.ఇది  ఇలా ఉంటే ఇవాల్టి నుంచి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ  పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు చంద్రబాబు కర్నూలు జిల్లాకు బయలుదేరి అక్కడ  పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను పర్యవేక్షించడం సహా... పార్టీ కార్యకర్తల నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో చంద్రబాబుకు రాయలసీమలో కూడా నిరసన సెగలు తప్పేలా కనిపించడం లేదు. అయితే కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

 

 

 

 అయితే చంద్రబాబు రాయలసీమ పర్యటనకు సంబంధించి సమాచారం అందుకున్న  రాయలసీమ వాసులు నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు అంటూ సమాచారం. రాయలసీమ విద్యార్థి జేఏసీ చంద్రబాబు రాయలసీమలో పర్యటించ వద్దంటూ నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్నూలు లోనే టిడిపి ఆఫీస్ ఎదుట విద్యార్థి జేఏసీ  ఆందోళన నిర్వహించారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హయాంలో కనీసం రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదని విద్యార్థి సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు నిరసన సెగలు భారీగానే తగలనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: