చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ పై కేసు నమోదు చేయబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది. నవంబర్ 28వ తేదీ చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన గడవకు సంబంధించిన పరిణామాలపై లోకేష్ పై కేసు నమోదు చేయటానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం. అమరావతి అభివృద్ధిని ప్రపంచానికి చాటాలనే ముసుగులో చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే.

 

చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని గ్రామాల్లోని కొందరు దళిత రైతులు, స్ధానిక యువత రెచ్చిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు తమను మోసం చేశాడంటూ వాళ్ళంతా పర్యటనకు మూడు రోజుల ముందునుండే ఆందోళనలు మొదలుపెట్టారు. సరే ఈ విషయాలను పక్కనపెడితే చంద్రబాబు పర్యటనలో జరిగిన గందరగోళం మొత్తాన్ని  కొందరు టిడిపి నేతలు ద్రోన్లతో చిత్రీకరించారు.

 

చంద్రబాబు పర్యటనతో పాటు గందరగోళాన్ని ద్రోన్లతో చిత్రీకరించేందుకు టిడిపి వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకుంది. ఈ మొత్తం లోకేష్ నేతృత్వంలోనే జరిగిందని ఆరోపణలు మొదలయ్యాయి. వైసిపి నేత లేళ్ళ అప్పిరెడ్డి ఈ మేరకు పోలీసులకు రాతమూలకంగా ఫిర్యాదులు కూడా చేశారు. లోకేష్ తో పాటు మరికొందరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా ద్రోన్లతో అసెంబ్లీ, సచివాలయం లాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ద్రోన్లను ఎగరేసి చిత్రీకరించారంటూ ఫిర్యాదు చేస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

గతంలో వరదలు వచ్చినపుడు కరకట్ట మీదున్న  చంద్రబాబు అక్రమనివాసం మీద ద్రోన్లు ఎగిరందనే విషయంలో ఎంత యాగీ చేసిందో అందరూ చూసిందే. తీరా చూస్తే ఎగిరిన ద్రోన్లకు ప్రభుత్వానికి సంబంధం లేదని తేలింది. ఎందుకంటే ద్రోన్లను ఎగరేసింది ఎల్లోమీడియానే అని తేలింది. అప్పటి నుండి మళ్ళీ నోరిప్పలేదు. పైగా అత్యంత భద్రత కలిగిన సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండానే టిడిపి నేతలు ద్రోన్లను ఎలా ఎగరేశారు ? అందుకనే వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: