బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నవంబర్ 22 న మధ్యాహ్నం ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఏఎస్‌ఐ నరసింహులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన తోటి ఉద్యోగులు మంటలార్పి అతడిని కిందకు తీసుకొచ్చి.. సమీపంలోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిన గాయాలతో ఏఎస్‌ఐ నరసింహులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మరణించారు.

 

 

ఇకపోతే సీఐ వేధింపులు కారణంగానే ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడిటన్లు ఆరోపణలు వచ్చాయి.దీంతో సీఐను బదిలీ చేశారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ కేసు విషయంలో తనకు సంబందం లేకున్నా ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని మనస్తాపానికి గురై నర్సింహులు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

 

 

ఇకపోతే బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించిన నరసింహులు ఇటీవలే మంచాల పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఓ కానిస్టేబుల్‌తో ఆయన గొడవపడటం వివాదా స్పదంగా మారడంతో బదిలీ వేటు వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఏఎస్‌ఐ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా ఏఎస్‌ఐ నరసింహ తన బావమరిదికి సంబంధించిన ఓ ఫంక్షన్‌లో కానిస్టేబుల్ దశరథ్‌తో గొడపపడ్డారట.

 

 

తాగిన మైకంలో ఆయనపై దుర్భాషలాడారు. అందుకు సంబంధించిన ఆడియో వాయిస్ వైరల్ కూడా అయింది. ఏఎస్‌ఐ నరసింహపై కానిస్టేబుల్ దశరథ్ బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు కూడా. ఇకపోతే నరసింహ మాత్రం బదిలీ వేటు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో నరసింహులు చేయి, తొడ, కడుపు భాగాల్లో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: