చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  జింగ్ పింగ్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగాయి.  చైనా అభివృద్ధికి అయన వేసిన బాటలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.  టెక్నాలజీని అక్కడ కుటీర పరిశ్రమల మార్చేశారు.  ప్రపంచంలో దొరికే ప్రతి ఖరీదైన వస్తువు చైనా కుటీర పరిశ్రమల్లో తయారవుతుంది.  కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రోత్సాహకం ఇవ్వబట్టే ఇది సాధ్యం అయ్యింది. 
చైనాలో అందరికంటే టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు.  ఈ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని చైనా అన్నిరకాల పనులు చేస్తున్నది.  ప్రపంచంలోని టాప్ కంపెనీలు చైనాలో కొలువుతీరుతున్నాయి.  అంతేకాదు, అక్కడి ప్రజలు కూడా టెక్నాలజీని అత్యధికంగా వినియోగిస్తున్నారు.  ప్రపంచం 4జీని వినియోగిస్తుంటే.. చైనా అప్పుడే 5జీ వినియోగంపై దృష్టి పెట్టింది.  త్వరలోనే 5జీని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది.  
5జీ వినియోగంతో అన్ని అందరికంటే ముందుండాలని చైనా భావన.  ఇక ఇదిలా ఉంటె, చైనా సెల్ ఫోన్ సిమ్ కార్డుల వినియోగంలో కూడా ముందు వరసలో ఉంటున్నది.  మనదగ్గర సిమ్ కార్డు కావాలని అంటే దృవీకరణ పత్రాలు సమర్పిస్తే చాలు.  ఆ ధ్రువీకరణ పాత్రల ఆధారంగా సెల్ సిమ్ తీసుకోవచ్చు.  మనం ఇష్టం వచ్చినట్టుగా వాటిని వాడిపారెయ్యొచ్చు.  
కానీ, చైనాలో అలాకాదు.  సెల్ ఫోన్ సిమ్ తీసుకోవాలి అంటే.. దృవీకరణ పత్రాలతో పాటుగా అతని ముఖాన్ని, కళ్ళను స్కాన్ చేస్తారు.  అలా స్కాన్ చేయడం వలన సిమ్ కార్డు కు సంబంధించిన ప్రతి విషయం కూడా అతనికి సంబంధించినదే అవుతుంది.  కనీసం అంతేకాదు, ఆ సిమ్ ను వినియోగించే మొబైల్ ఫోన్ లో పేరు కూడా ఒరిజిలాన్ గానే ఉండాలి.  ఇలా చేయడం వలన అతనికి సంబందించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుంది.  ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరిగినా వెంటనే ఆ మొబైల్ ఫోన్ ఆధారంగా అతని వివరాలు ఫొటోతో సహా తెలుసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: