జగన్ ముఖ్యమంత్రి అయి కచ్చితంగా ఆరు నెలలు అయింది. అయిదేళ్ళ పాలనకు ప్రజలు అధికారం ఇస్తే అందులో పదవ వంతు పూర్తి అయిందన్న‌ మాట. ఇంకా తొమ్మిది వంతులు మిగిలే ఉన్నాయి.  ఒక వైపు చూస్తే ఇది చాలా తక్కువ సమయం. జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచే అన్ని  హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. అలా ఒక్కోటీ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నారు. 

 

అయితే జగన్ ఆరు నెలల పాలనపైన మేధావులు, రాజకీయ‌ విశ్లేషకుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు కానీ ఏపీలోని రాజకీయ పక్షాలు మాత్రం విమర్శల జల్లు కురిపించేశాయి. తెలుగుదేశం ఎపుడూ ఈ విషయంలో ముందు ఉంటుందన్నది వాస్తవం. ముంచే సీఎం అంటూ జగన్ పాలనపైన ఘాటు కామెంట్స్ చేసింది. జగన్ పాలన అంతా అద్వాన్నమని విమర్శలు చేసింది.

 

 

మరో వైపు బీజేపీ కూడా జగన్ పాలన ఏమీ బాగులేదని పెదవి విరిచింది. జగన్ పాలనలో అన్నీ కష్టాలే తప్ప మరేమీ లేదని కూడా తేల్చేసింది. జగన్ ముఖ్యమంత్రి కావడం తప్ప కొత్త విషయం వేరేదీ లేదని కూడా కచ్చితంగా చెప్పేసింది.

 

సిధ్ధాంతాలలో బీజీపీకి వామపక్షాలు భిన్నం. అయినా వామపక్షాలు సైతం జగన్ పాలనను నిందిస్తున్నాయి. జగన్ ది ఏక పక్ష పలన అని, విపక్షాలను అసలు ఖాతరు చేయడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అన్నారు. జగన్ పాలనలో ఇసుక కొరతతో అయిదు నెలల పాటు భవన నిర్మాణ కార్మిములను రోడ్డు మీద ఉంచారంటూ గట్టిగానే తగులుకున్నారు.

 

మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ పాలన అసలు బాగోలేదని తేల్చేశారు. ఇవన్నీ సరే కానీ జగన్ పాలన పట్ల నిశితంగా పరిశీలించి విమర్శలు చేసే రాజకీయ పక్షాలే లేవా అన్నదే ఇక్కడ పాయింట్. నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. ఏపీలో అవినీతి తగ్గింది, ఆర్టీనీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధులకు ఫీజ్ చెల్లించకుండా ఉచితంగా చదువు అంటున్నారు.

 

ఆరోగ్యశ్రీ పధకాన్ని పునరుద్ధరించారు. వీటన్నింటికీ మించి ఏపీలో ఫిరాయింపుల కంపు లేదు, మరి ఈ నిర్ణయాలు కనీసం వామపక్షాలకైన కనిపించలేదా అని అంతా ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే ఏపీలో రాజకీయానికి జగన్ టార్గెట్ గానే కనిపిస్తున్నారు, తప్ప నిజాయతీగా విశ్లెషణ చేసే పార్టీ కానీ నేత కానీ లేకపోవడం బాధాకరమనేనని అంటున్నారు. 

 

అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే రాజజీయ నాయకుల మెదళ్ళ నుంచి ఆలోచన చేయడం జనం ఎపుడో  మానుకున్నారు. వారు కరెక్ట్ గా తప్పుని తప్పు అంటున్నారు. ఒప్పుని ఒప్పు అంటున్నారు. అందువల్ల  ప్రజలే రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్ పాలన మీద తొలి తీర్పు ఇస్తారు. అదే నిజనైన అభిప్రాయంగా అంతా భావించాలి కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: