వాన రాకడ ప్రాణం పోకడ ఎవ్వరూ ఊహించలేరు..అదే విధంగా ఈ మద్య కాలంలో ప్రమాదాలు సెకన్లలో జరగడం ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసి పోవడం చూస్తున్నాం.  తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఇటీవల కాలంలో ఎడతేరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఓ నాలుగు భవనాలు నిట్టనిలువునా కూలిపోయింది. దాంతో ఆ భవనాల కింద సుమారు 12 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుంతుంది. అయితే మరికొంత మంది భవనం కింద ఉండొచ్చని వెలికితీత పనుల్లో ఉన్నవారు చెబుతున్నారు.  భవనాలు కూలిన సమయంలో ప్రమాదానికి గురైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

 

  ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. అయితే ఎంత మంది మృతి చెందారన్నదానిపై అధికారిక సమాచారం లేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  కాగా,  భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.  

 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి, శివారులోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఇక అధికారులు శిథిలావస్థకు వచ్చిన గృహాల్లో కానీ, భవనాల్లో కాని ఆవాసం ఉండరాదని హెచ్చరిస్తూనే ఉన్నారు.  ఇదిలా ఉంటే భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు సెలవు ప్రకటించారు. బారీ వర్షాల కారణంగా రోడ్డు రవాణాకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు అంటున్నారు. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: