లోకజ్ఞానం కూడా సరిగా తెలియని స్థితిలో, చదువుకునే వయసులో అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉండే ఆకర్షణను ప్రేమగా భావించి..దానినే ప్రేమ అనుకోని దానికి అందమైన భావాలను అల్లుకొని ఎక్కడెక్కడో ఊహల్లో విహరించి, మోహించి కామించి చివరకు తమ జీవితాలను విషాదంగా మార్చుకుంటున్నారు నేటి యువత.  దీని నుంచి బయటపడేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు. 
అంతేకాదు, వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.  వాళ్ళను ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియడం లేదు.  అందుకే ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  దిశ అత్యాచారం, హత్య తరువాత పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు.  ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా వెంటనే పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు. ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటున్నారు.  
దిశా హత్య జరిగిన రోజున ఓ అమ్మాయి హుస్సేన్ సాగర్ లో దూకి మరణిస్తాను... నాన్న నా శవాన్ని వచ్చి తీసుకెళ్లండి అని చెప్పింది.  వీడియో తీసి పంపింది.  ఆ తరువాత ఆ అమ్మాయి ఏమైందో తెలియలేదు.  హయత్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్నది.  మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్న సమయంలో అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి.  
డిగ్రీ చదువుతున్న అమ్మాయి మిస్సింగ్ జరిగిన రోజు నుంచి ఆమె చదివే కాలేజీలో చదివే మరో యువకుడు కూడా కనిపించకుండా పోయాడు.  అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది.  వీరిద్దరి ప్రవర్తనపై తీశారు.  ఈ అబ్బాయికి సంబంధించిన బంధువులు గుంటూరులో ఉన్నట్టుగా తెలుసుకొని అక్కడికి పోలీసులు సమాచారం అందించారు.  పోలీసులు అనుమానించిందే కరెక్ట్ అయ్యింది.  అబ్బాయి మైనర్ కావడంతో మరో మూడు రోజుల్లో అబ్బాయి మేజర్ అవుతాడని గమనించిన వీరు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లారు.  అక్కడ ఆ అబ్బాయి బంధువుల దగ్గర ఉన్నారు.  హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరు పోలీసులు అలర్ట్ అయ్యి ఈ ఇద్దరిని గుంటూరులో పట్టుకున్నారు.  చివరకు కథను ఇలా సుఖాంతం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: