ఒకప్పుడు అతి తక్కువ కాల్ డేటా  చార్జీలతో వినియోగదారులు ఎంతగానో ఆకర్షించిన  టెలికాం రంగ సంస్థలు ప్రస్తుతం అదే వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి . ఒకప్పుడు మా నెట్వర్క్ లో అతి తక్కువ డేటా కాల్ ఛార్జీలను అందిస్తున్నామని చెప్పిన టెలికాం రంగ సంస్థలు... ఇప్పుడు తక్కువ డేటా కాల్స్ చార్జీలు  ద్వారా సంస్థకు నష్టం వాటిల్లుతుందని వినియోగదారులు ఇబ్బంది పడినా పర్వాలేదు ఎక్కువగా డాటా చార్జీలు పెంచాల్సిందే అంటూ నిర్ణయం తీసుకున్నారు. భారీగా  కాల్ డాటా చార్జీలను పెంచి సరికొత్త నిర్ణయం తీసుకున్నాయి టెలికాం రంగ సంస్థలు. భారీగా పెంచిన కాల్ డేటా చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కాగా  టెలికాం రంగ సంస్థల పెంచిన  భారీ చార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 

 

 

 

 ఇప్పటికే దేశంలోని టెలికాం రంగ సంస్థల్లో ఎక్కువగా వినియోగదారులను కలిగి ఉన్న వోడాఫోన్ మీడియా సంస్థ మొదట అన్ని టెలికాం రంగ సంస్థల కంటే ముందు డాటా కాల్ ఛార్జీలను ఒక రేంజ్ లో పెంచేసింది.  ఇక ఆ తర్వాత  అన్ని  టెలికాం రంగ సంస్థలు కూడా సేమ్ రూటు నడిచాయి. దీంతో చౌకధరల మొబైల్ సేవలకు అన్ని టెలికాం రంగ సంస్థలు స్వస్తి  పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలో మొదటిసారి చందాదారులకు కాల్ డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగ సంస్థలు ప్రకటించాయి. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అయితే ఈ కొత్త ఛార్జీల పెరుగుదల 50 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తమ తమ నెట్వర్క్ ల నుండి ఇతర  నెట్వర్క్లకు చేసే కాల్స్ కు కనీసం ఆరు పైసల చొప్పున వసూలు చేస్తామని అంతేకాకుండా ఇన్కమింగ్ కాల్స్ కోసం కనీసం నలభై తొమ్మిది రూపాలతో రీఛార్జ్  చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

 

 

 

అంతే  కాకుండా అటు ప్రజలలో  ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తున్న టెలికాం రంగ సంస్థ జియో కూడా గత నెల 6 నుంచి మొబైల్ సేవల ఛార్జీలను 40శాతం మేర పెంచుతున్నట్లు అపరిమిత వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కువమంది మొబైల్ వినియోగదారులను కలిగిన వోడాఫోన్ ఐడియా సంస్థ... 2, 28 84, 365 రోజు కాల పరిమితితో... అపరిమిత వినియోగం కింద ఉన్న కొత్త చార్జీలు ను ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీల పెరుగుదల 41.2 శాతంగా ఉంది. ప్రస్తుతం 365 రోజుల పరిమిత కాలపు 12 జీబీ డేటా పథకం 988 రూపాయల  నుంచి 1499 రూపాయలకు  పెరగనుంది. 

 

 

 

 అటు భారతీయ ఎయిర్టెల్ సంస్థ కూడా వొడాఫోన్ ఐడియా పెంచిన ధరలతోనే  ప్లాన్స్  వినియోగదారులను అందిస్తుంది . అయితే ఈ కొత్త చార్జీలతో వినియోగదారులు మాత్రమే బెంబేలెత్తిపోతున్నారు . మొన్నటి వరకు మొబైల్ సేవలకు తక్కువ  ఉన్నాయని సంబర పడిన వినియోగదారులు ఇప్పుడు మాత్రం టెలికాం రంగ సంస్థలు చార్జీలు పెంచుతూ ఉండటంతో ఏ  నెట్వర్క్ లో  కొనసాగాలి ఏ  నెట్వర్క్ లో  కొనకూడదు అని ఆలోచన కూడా రాకుండా అయిపోయింది. ఈ చార్జీల మోత నేటి నుంచి అమలు కానుంది. మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడటం తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: