నేడు  ఆంధ్ర ప్రదేశ్  సీఎం  జగన్  కొత్త  పథకానికి శ్రీకారం చుట్ట బోతున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేయించుకున్న వారి అందరికి  విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు సాయం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  నేడు ఉదయం 11.20 నిమిషాలకు సీఎం జగన్ గుంటూరులోని సర్వజన వైద్యశాలలో ప్రారంభించబోతున్నారు. వైద్యశాలలో రోగులకు చెక్కులు అందజేసిన అనంతరం గుంటూరు మెడికల్ కాలేజి జింఖానా ఆడిటోరియంలో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు అని సమాచారం.
 


ఇక వైద్యుల సలహా ప్రకారం శస్త్ర చికిత్స చేయించుకున్న రోగికి ఎంత విశ్రాంతి అవసరమో అప్పటి వరకు ప్రభుత్వ సాయం అందిస్తుంది అని తెలిపింది జగన్ సర్కార్. దారిద్య్ర రేఖకు దిగువన ఉంటూ శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు కోలుకునేంత వరకు రోజుకు రూ. 225 చొప్పున, నెలకు గరిష్ఠంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించబోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే కదా.

 

ఇక కిడ్నీ బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు నెలకు రూ. 10వేల చొప్పున పింఛన్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీటితో పాటు బోధకాలు, పక్షవాతం రోగులకు నెలకు రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియచేయడం జరిగింది. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కూడా వారి విశ్రాంతి సమయంలో సాయం అందించడం పై అంతా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు కార్యాచరణ కూడా  సిద్దంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

 

ఇక వైఎస్సార్‌ ఆసరా వివరాలు ఇలా.. మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26 , ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836 , రోజుకు ఇచ్చే మొత్తం రూ.225 , నెల రోజుల విశ్రాంతికి   రూ.5000 , లబ్ధిదారుల సంఖ్య  4.50 లక్షలు, ప్రతి సంవత్సరం వ్యయం దాదాపు రూ.300 కోట్లు. ఇక ఈ పథకం అందరికి లబ్ది చేకూరుతుంది అని జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: