తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు వారం రోజుల కస్టడీకి కోరనున్నట్లు తెలిసింది. ఇక ఈ నలుగురు నిందితులకూ కోర్టు... 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా తాజాగా ఇందుకు సంబంధించి ఇవాళ కస్టడీ పిటిషన్‌ను కోర్టులో వెయ్యనున్నారు. ఐతే... ఈ కేసులో పూర్తి వివరాలు బయటకు తేవాలని భావిస్తున్న పోలీసులు... హత్య, అత్యాచారం, ప్లాన్ అన్ని అంశాలనూ వివరంగా తెలుసుకొని... పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.

 

 

ఇదిలా ఉండగా మరోవైపు నిందితుల తరపున ఏ లాయరూ వాదించకూడదని ఇప్పటికే బార్ అసోసియేషన్ నిర్ణయించినందువల్ల... నిందితులు తమ తరపున తామే కోర్టులో వాదనలు వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదా  న్యాయ సలహా కేంద్రం ద్వారా జడ్జి ఎవరైనా వాదించేందుకు కోరతారా అన్నది తెలియవలసి ఉంది. ఇకపోతే పోలీసులు కచ్చితమైన ఆధారాలు సమర్పించే అవకాశం ఉండటంతో ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు తమ అభిప్రాయం చెబుతున్నారు.

 

 

అంతే కాకుండా దేశవ్యాప్తంగా నిందితులకు ఉరిశిక్షే వెయ్యాలనే డిమాండ్ ఉండటంతో... జడ్జి కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక మంచి ఉద్దేశంతో వెటర్నరీ డాక్టరైన దిశను అత్యాచారం, హత్య చేసిన కేసులో పోలీసులు 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్/డబ్లూ 34,392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును విచారణ చేస్తోంది.

 

 

అయితే ఇప్పటికే పోలీసులు చాలా సాక్షాధారాలు సేకరించారు. అదే కాకుండా హత్య తర్వాత ఆమెపై పోసిన పెట్రోల్ ఏ బంక్‌లో కొన్నారో కూడా ఆధారాలు సేకరించారు. అదీకాకుండా మరికొన్ని కీలక సాక్ష్యాల్ని సేకరించి ఛార్జిషీట్ రెడీ చెయ్యాలను కుంటున్నారు. ఇకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: