జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబునాయుడు హ్యాపీగా ఉన్నారా ? ఉండే ఉంటారు లేండి. ఇంతకీ ఏ విషయంలో అంటారా ? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లరిపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నియమించారు.

 

మామూలుగా పోలీసులతో విచారణ జరిపించటం కన్నా సిట్ తో దర్యాప్తు జరిపించటం మేలే కదా. అదికూడా సిట్ దర్యాప్తును వారం రోజుల్లోనే ముగించి నివేదికను ఇవ్వాలంటూ జగన్ స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన సిట్ మొక్కుబడి విచారణలు లాంటవి కావని అర్ధమైపోతోంది. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు కూడా హ్యాపీగానే ఉంటారనటంలో సందేహం లేదు.

 

ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, కర్రలు విసిరిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేష్, నేతలు మాత్రం అల్లర్లు చేయించింది జగన్, మంత్రులే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల నష్టపోయిన బాధితులే  దాడి చేశారంటూ మంత్రులు, ఎంఎల్ఏలు ఎదురుదాడులు చేస్తున్నారు.

 

సరే ఎవరు ఎవరిపై దాడి చేసినా ఆమోదయోగ్యం కాదు. అధికార-ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సంబంధం లేకుండా సిట్ విచారణకు ఆదేశించటం మంచిదే. గతంలో తన హయాంలో చంద్రబాబు ఎన్ని సంఘటనల్లో సిట్ విచారణలు వేశారో లెక్కేలేదు. ఆ విచారణ నివేదికలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా చంద్రబాబు బయటకు చెప్పలేదు. విశాఖపట్నంలో భూ కుంభకోణం, విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం  ఘటన...ఇలా చెప్పుకుంటే చాలా వాటిపై సిట్ విచారణలు చేయించారు.

 

ఏ విషయంలో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. పైగా సిట్ విచారణకు అప్పట్లో చంద్రబాబు గడువు కూడా పెట్టలేదు. కానీ ఇపుడు జగన్ తాజా ఘటనలో విచారణకు కేవలం వారం రోజులు మాత్రమే గడువిచ్చారు.   కాబట్టి  ఏదో ఓ రోజు సిట్ విచారణ నివేదిక వెలుగు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంది. చూద్దాం  విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: