జగన్మోహన్ రెడ్డి పేరు విషయంలో  జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజారంజక పాలన అందిస్తేనే జగన్ ను గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని అంటాడట. అలా కాకుండా కేవలం పార్టీ నేతల కోసం, తన మద్దతుదారుల కోసమే పరిపాలన చేస్తున్నంత కాలం సిఎంను జగన్ రెడ్డి అనే అంటారట.

 

రాయలసీమలోని కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పర్యటనలో పవన్ ఈ విషయాన్ని బహిరంగసభలోనే ప్రకటించారు. ఇక్కడ పవన్ గమనించాల్సిన విషయం ఒకటుంది. రాష్ట్రంలోని నూరుశాతం జనాలను సంతోష పరచటం ఏ ముఖ్యమంత్రి వల్లా కాదు. నూరుశాతం జనరంజక పాలన అందించటం కలలో కూడా ఎవరికీ  సాధ్యంకాదు.

 

ఎందుకంటే పార్టీల వారీగా, మతాలు, సామాజికవర్గాల వారీగా సమాజంలో చీలికలు వచ్చేసిన తర్వాత ఎవరికైనా జనరంజక పాలన ఎలా సాధ్యమని పవన్ అనుకున్నారు ? పైగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబునాయుడు, పవన్ లాంటి వాళ్ళు ఉన్నంత వరకూ ఎవరూ ఏమీ చేయలేరు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో కొన్నిమంచి నిర్ణయాలు కూడా ఉన్నాయి.

 

మంచిని మంచి-చెడును చెడుగా చూడలని రాజకీయపార్టీలు వాటికి వత్తాసుగా నిలిచే ఎల్లోమీడియా ఉన్నంత వరకూ జగన్ పై ఆరోపణలు వస్తునే ఉంటాయి. అసలు జగన్ ను సిఎంగా గుర్తించటానికే చంద్రబాబు, పవన్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. అలాంటపుడు జగన్ ను పవన్ ఎలా పిలిస్తే ఏమిటి ?  సిఎంను పవన్ ఎలా పిలిచినా పట్టించుకునే జనాలు ఉండరు.

 

ఇక ఆరుమాసాల పాలనంటారా ఐదేళ్ళల్లో  అమలు చేయలేని ఏ ఒక్క హామీనీ  ప్రశ్నించని  పవన్ ఆరు మాసాల పాలనలోనే జగన్ పాలనను ప్రశ్నిస్తుండటమే  విచిత్రంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి అన్నా జగన్ రెడ్డి అని పవన్  పిలిచినా ఒకటే. ఎందుకంటే పవన్ ను ఎవరూ పట్టించుకోవటం లేదు కాబట్టే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: