రోజు క్రమం తప్పకుండా 9 గంటలకు నిద్రపోవాలి.. అలా నిద్రపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది.  ఉదయం అంతా యాక్టివ్ గా పనిచేయగలుగుతారు.  కానీ, చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు.  సరిగా నిద్రపోలేరు.  నిద్రలేని వాళ్లకు చాలా ఇబ్బందులు వస్తాయి.  ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మంచి నిద్ర కావాలి.  మంచి నిద్ర ఉంటేనే మనిషి ఎలాంటి పని అయినా చేయగలుగుతారు.  


నిద్ర సుఖమెరుగదు అంటారు.  అలానే నిద్ర కోసం ప్రతి ఒక్కరు తపించిపోతారు.  ఇక కొన్ని కంపెనీలైతే... రెస్ట్ హవర్ అనే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి  ఇస్తున్నది.  ఇలా రెస్ట్ హవర్ ను కేటాయించడం వలన ఉద్యోగులు కొంత ఎక్కువగా పనిచేయగలుగుతారు.  ఇలాంటి విషయాల్లో జపాన్ ముందు వరసలో ఉంటుంది.  జపాన్ దేశాన్ని చాలా దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.  ఇప్పుడు ఇండియాలోని కొన్ని కంపెనీలు ఇదే విధమైన నియమాలను పాటిస్తున్నాయి.

 
ఇక ఇదిలా ఉంటె, బెంగళూరు కు చెందిన ఓ స్టార్ట్ అప్ కంపెనీ ఇలాంటి ఓ పద్ధతిని తీసుకొచ్చింది.  వెరీ సింపుల్.  రాత్రి పూట చక్కగా 9 గంటలపాటు నిద్రపోవాలి.  అలా చక్కగా నిద్రపోగలిటితే చాలు నెలకు లక్ష రూపాయల జీతం ఇవ్వడానికి ఆ కంపెనీ రెడీ అయ్యింది.  దీనికి కావాల్సిన అర్హత కేవలం చక్కగా నిద్రపోవడమే.  చక్కగా నిద్రపోవాలి అంటే మంచి ఆరోగ్యంగా ఉండాలి.  మనిషికి నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు.  


ఇలా కనుక నిద్రపోగలిగితే లక్ష రూపాయల ఉద్యోగం సంపాదించవచ్చు.  అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి.  ఈ స్టార్ట్ అప్ కంపెనీ బెంగళూరులో ఉన్నది.  ఆ కంపెనీ పేరు వేక్ ఫిట్... ఈ సంస్థ స్లీప్ అండ్ ప్యాట్రన్స్ పై ఈ సంస్థ స్టడీ చేస్తున్నది.  ఈ కంపెనీలో జాయిన్ కావాలి అనుకునేవారు wakefit.co వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ వందరోజుల ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంపికైన వాళ్లకు వారి ఇంటికే కంపెనీ మ్యాట్రెస్, స్లీప్ ట్రాకర్స్ పంపుతాం. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులు వారు నిద్రపోయే సమయాన్ని వీడియో తీసి పంపాలి.  సింపుల్ ఇంతే.. ఇలా చేస్తే మూడు నెలల పాటు నెలకు లక్ష రూపాయల చొప్పున జీతం పట్టెయ్యొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: