దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు చాలా తక్కువ రోజుల్లోపే మరణ శిక్ష పడే విధంగా సన్నాహాలుచేస్తున్నారు. ఇక నిందితులపై అతి కఠినమైన 7 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. నలుగురు నిందితులపై 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్‌/డబ్ల్యూ 34, 392 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులు అతి కఠినమైనవి గా న్యాయవాదులు పేర్కొంటున్నారు.

 

నిందితులకు నెల రోజుల్లోపే మరణ శిక్ష 

 

అతి దారుణానికి పాల్పడిన నిందితులకు న్యాయవాదుల ఎవ్వరూ నిందితుల తరపున వాదించొద్దని బార్ అసోసియేషన్ లో తీర్మానం చేసిన నేపథ్యంలో డిఫెన్స్ వాదనలు ఉండని కారణంగా మరియు ఫాస్ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపి నిందితులకు వీలైనంత తొందరగా శిక్ష విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

ఇక సైబరాబాద్ పోలీసులు కేసు విచారణకు అవసరమైన సాక్ష్యాలను సంపాదించారు. కేసులో ప్రధాన సాక్షి అయిన లారీ ఓనర్ శ్రీనివాస రెడ్డి వాంగ్మూలం ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు, నిందితులు ఘటన జరిగిన రోజు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద సంచరించినట్లు కీలక ఆధారాలు సంపాదించారు.

 

చర్లపల్లి జైల్లో నిందితులకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పోలీసులు అడిగిన 14 రోజుల కస్టిడీ కి అప్పగించడంతో విడివిడిగా నిందితులను సింగల్ సెల్లుల్లో వేసి విచారిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన రోజున పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించకుండానే జైలు కు తరలించారు. జైలు లోనే వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులు శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నట్లు తేల్చారు వైద్యులు.

 

గతంలో ఫాస్ట్రాక్ కోర్టు వరంగల్ జిల్లాలో చిన్నారిని కిడ్నప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడికి కేవలం 56 రోజుల్లోనే మరణ శిక్ష విధించింది. ఇక ఈ కేసులో కూడా నిందితులకు నెల రోజుల్లోపే శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అంతే తొందరగా ఈ కేసులో నిందితులకు మరణ శిక్ష విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: