నవంబర్ 27 వ తేదీన నగర శివారులో తోడుంపల్లి ఓఆర్ఆర్ టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో దిశపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.  పోలీసులు వారి నుంచి అనేక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇక నిందితులను పట్టుకున్న ఈరోజున ఈ ఉదంతం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.  


సెలెబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై స్పందించారు.  మంత్రులు,  కేంద్ర మంత్రులు దిశ తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్లి పరామర్శించారు.  వారికీ ధైర్యం కల్పించారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఘోషిస్తోంది.  కాగా, ఈ విషయంపై ఈరోజు పార్లమెంట్ లో చర్చ జరగబోతున్నది.  


జీరో అవర్లో దీనిపై చర్చ చేస్తున్నారు.  దిశ కేసు విషయంలో తీవ్రస్తాయిలో అన్ని పార్టీలు మండిపడుతున్నాయి.  నలుగురు నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.  ఇప్పటికే గులాంనబి ఆజాద్ దీనిపై ప్రసంగం చేశారు.  చర్చకు పట్టుబట్టారు.  ప్రస్తుతం పార్లమెంట్ ఇదే విషయంపై అట్టుడికి పోతున్నది.  ఎలాగైనా సరే నిందితులు బయటకు రాకుండా చూడాలని, రేప్ చేసిన వాళ్లకు కఠిన శిక్షలు వేయాలని అంటున్నారు.  


అటు చట్టాలను మార్చేందుకు ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధం అయ్యింది.  బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.  దీనిపై కూడా ఈరోజు పార్లమెంట్ లో చర్చ జరగబోతున్నది.  మరి పూర్తి స్థాయిలో ఈ విషయంపై చర్చ చేస్తారా ఎప్పటిలాగే గొడవలు రాద్ధాంతం చేసి సభను ముగిస్తారా చూడాలి.  దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, వారికీ ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇవ్వబోతుందో చెప్పాలని కొంతమంది మహిళలు పార్లమెంట్ లో పట్టుబట్టే అవకాశం ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: