తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసు.   ఈ కేసు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.  అయితే కొన్ని విమర్శలు సైతం పోలీస్ వారిపై వచ్చాయి. ఇక  హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ దిశ పై అఘాయిత్యం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా, ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరును, వారి కుటుంబసభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పేరును ‘దిశ’గా మారుస్తున్నట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే ఈ విషయమై ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పారు.

 

ఇకపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరును ‘దిశ’ అని పేర్కొనాలని, ‘జస్టిస్ ఫర్ దిశ’కు అందరూ సహకరించాలని కోరారు.  ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కొందరు అంటుంటే, మరణ శిక్ష విధించాలని మరికొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  దిశ హత్యాచార నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసును త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వీలైనంత త్వరలో నిందితులపై చార్జ్‌షీట్ రూపొందించాలని పోలీసులు భావిస్తున్నారు.

 

తాజాగా పార్లమెంట్‌ కు నేడు దిశ హత్య కేసు చేరింది. సోమవారం కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశంలో.. దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని విప‌క్షాలు  వాయిదా తీర్మానం ఇచ్చారు. జీరో అవర్‌లో చర్చిద్దామని లోక్‌సభ స్పీకర్‌ తెలిపారు. కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాలు మార్చాలని డిమాండ్‌ చేస్తూ.. పార్లమెంట్‌ బయట విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దేశంలో కొంత కాలంగా ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులే కాదు ఏకంగా హత్యలకు కూడా తెగబడుతున్నారని.. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వాధిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. క్వశ్చర్‌ అవర్‌ ను రద్దు చేసి దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని, తక్షణం చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: