నాలుగు రోజుల క్రితం జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో ఎంపిలు సంచలన డిమాండ్ చేశారు. దిశ హత్యోదంతంపై వివిధ పార్టీల రాజ్యసభ ఎంపిలు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా డిమాండ్ మాత్రం ఒకటే. నిందుతులకు వెంటనే మరణశిక్షణ విధించాలన్న డిమాండ్ తో సభ మారుమోగిపోయింది.

 

అత్యంత కిరాతకంగా, ఘోరంగా జరిగిన ఈ ఘటన విచారణపై ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఎంపిలు డిమాండ్ చేశారు. సరే  ఈ విషయంలో ఇప్పటికే కేసియార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన కేసు విచారణను ముగించాలని కూడా సూచించారు. ఏఐఏడిఎంకె ఎంపి విజిల సత్యనాధ్ అయితే ఈనెల 31వ తేదీలోగా నిందుతులందరినీ ఉరి తీసేయాలని డిమాండ్ చేశారు.

 

అలాగే సమాజవ్ వాది పార్టీ ఎంపి జయాబచన్ మాట్లాడుతూ నిందితుంలదరికీ ఉరి తీయటమే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. నిందుతులందరినీ వెంటనే ఉరి తీయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ నిందుతలకు వేసే శిక్షతో ఆడపిల్లల విషయంలో చీప్ గా ఆలోచించే వారందిరికీ ఓ గుణపాఠంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్ష వేసిన తప్పులేదని అభిప్రాయపడ్డారు.

 

డాక్టర్ దిశ ఘటనపై రాజ్యసభ జీరో అవర్ లో  సుమారు 45 నిముషాల చర్చ జరిగింది. దాదాపు 15 పార్టీలకు చెందిన ఎంపిలు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా నిందుతులందరికీ వెంటనే ఉరిశిక్ష వేయాలన్న డిమాండే వినిపించింది.

 

కొందరు ఎంపిలు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కూడా సూచించారు. ఏదేమైనా డాక్టర్ దాశ ఘటనకు కారకుల శిక్ష విషయంలో  రాజ్యసభ ఎంపిలందరూ ఏకతాటిపై ఒకే డిమాండ్ చేయటం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: