దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే వారికి చర్లపల్లి జైల్లో రాచమర్యాదలు దక్కుతున్నాయంటూ వస్తున్న వార్తలు జనంలో ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దిశ హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, 2 క్లీనర్‌ జొల్లు శివ (20), 3 జొల్లు నవీన్‌ (23), 4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌) ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు.

 

 

దిశ హత్య కేసులో నిందితులకు చర్లపల్లి జైల్లో మెుదటి రోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు జైలు సిబ్బంది. దిశ హత్యకేసులో శనివారం షాద్ నగర్ మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఈ విషయంలో జైలు అధికారులు ప్రత్యేకంగా వారిపై శ్రద్ధ తీసుకోలేదు. సాధారణంగా జైలులోని ఖైదీలకు ఆదివారం మాంసాహారం అందిస్తారు. అందులో భాగంగానే దిశ హత్య కేసు నిందితులకు కూడా మటన్ తో భోజనం పెట్టినట్టు తెలుస్తోంది.

దిశ హత్య కేసు నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, జొల్లు శివలకు ఆదివారం ఉదయం టిఫిన్ గా పులిహోర పెట్టారు. మధ్యాహ్నాం భోజనంలో 250 గ్రాముల ఆహారాన్ని అందజేశారు. ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందస్తారు. అందుకే నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం పెట్టారు.

 

అయితే అసలు ఇలాంటి పుండాకోర్లను ప్రభుత్వ సొమ్ముతో మేపడం ఏంటన్న ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. నేరం అంగీకరించిన తర్వాత వెంటనే ఉరి తీసేయాలని.. పలువురు కోరుతున్నారు. వీరి ఆశలకు అనుగుణంగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: