అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న కీలక నిర్ణయాలు తీసుకుంటు సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నారు . ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా నాయకుడిగా ప్రజల మనిషిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి 2000 వ్యాధులను కలుపుతూ  సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు ఎవరు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... ప్రభుత్వాసుపత్రిలో వెయ్యి రూపాయలకు మించి ఖర్చు అయితే   అది  ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుందని జగన్ మోహన్ రెడ్డి సర్కారు తెలిపింది. 

 

 

 

 అయితే పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు  హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి నగరాల్లో  మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను కూడా  ఆరోగ్యశ్రీ ని  అనుసంధానం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా  ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. గుంటూరులోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పదే పదే నా మతాన్ని ప్రస్తావిస్తున్నయన్నారు . నా మతం మానవత్వం అంటు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

 

 

 

 అంతేకాకుండా నా కులం మాట నిలబెట్టుకోవడం అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో రూపురేఖలను మారుస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ఏడు చోట్ల అధునాతన హంగులతో సరికొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపడతామని తెలిపారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని... ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగించుకుని మెరుగైన వైద్యం  పొందాలంటు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: