వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా అనేక పధకాలు ప్రవేశపెట్టారు.  ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో 9 రకాల హామీలు ఇచ్చారు.  ఆ తొమ్మి రకాల హామీలను ఐదేళ్లలో నిర్వర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్.  అడుగులు వేయడమే కాదు.  ఆ దిశగా కూడా పనిచేస్తున్నారు.  పనిచేస్తున్నారు.  


ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలావరకు అమలు చేశారు.  ఎన్నికలు ముగిసి జగన్ అధికారం చేపట్టిన మొదటిరోజు మొదటి సంతకం జగన్ వృద్దాప్య పింఛన్ పథకంపై పెట్టారు.  ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ప్రతి ఏడాది రెండు వందల యాభై రూపాయల చొప్పున పింఛన్ పెంచుతున్నట్టు జగన్ చెప్పారు.  అదే సమయంలో బాబు వస్తారు... ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పి ప్రజలను మోసం చేసిన బాబుగారు, అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది.  


దానిని నివారించేందుకు జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజునే జగన్ నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  హామీ ఇచ్చిన విధంగానే జగన్ ఆగష్టు 15 వ తేదీన 2.5 లక్షల మంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు.  ఆ తరువాత 1.5 లక్షల గ్రామసచివాలయ ఉద్యోగాలు కల్పించారు.  నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు నెలల కాలంలో కల్పించడం అంటే మాములు విషయం కాదు.  ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.  


ఇలా ఎన్నో పధకాలు ప్రవేశపెట్టిన జగన్ ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పధకాన్ని ప్రవేశపెట్టారు.  ఈ పధకాన్ని వివరించే సమయంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  తన కులం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కులం అని అన్నారు.  ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే తనకు తెలుసు అని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.  ఇక ఎన్నికల సమయంలో రూపొందించిన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించినట్టు జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  నా మతం మానవత్వం అని..అందరిని సమానంగా చూసే విధంగా తన మనసు ఉంటుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: