ఆంధ్ర ప్రదేశ్  విశాఖ మన్యంలో నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంత మంతా అలజడి వాతావరణం నెలకొంది. భద్రత బలగాలు ముమ్మరంగా మన్యంలో కూబింగ్‌ నిర్వహించడం జరుగుతుంది. దీంతో అక్కడ ఉన్న గిరిజన ప్రజలంతా ఏ క్షణాన ఏమవుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ.. బ్రతుకుతున్నారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VISHAKAPATNAM' target='_blank' title='విశాఖ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విశాఖ</a> మన్యంలో బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు

 

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పఎల్‌జిఎ) వారోత్సవాలు మన్యంలో బాగా అలజడి రేపుతున్నాయి. ఎఎల్‌జిఎ 19 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మావోయిస్టులు వారోత్సవాల విజయవంతం చేయడంలో నిమగమైతే, వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలతో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని జల్లిడ పట్టడం మొదలు పెట్టారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో గెరిల్లా దళాల పునర్నిర్మాణానికి సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పావులు కదుపుతోంది.

 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు,సీలేరు, జీ,కే.వీధి, చింతపల్లి, అన్నవరం, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, అనంతగిరి పోలీసుస్టేషన్ల అధికారులు, ప్రత్యేక పార్టీల పోలీసులు అప్రమత్తం అవ్వడం జరిగింది. రాళ్లగెడ్డ, కోరుకొండ, నుర్మతి, రూడకోట అవుట్‌ పోస్టులలో రెడ్‌ అలర్ట్‌ కూడా ప్రకటించడం జరిగింది. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో ఏవోబీ అంతా పోలీసు నిఘా అధికమైంది.అన్ని మండల కేంద్రాలు ,ప్రధాన రోడ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు పోలీసులు చేపడుతున్నారు.

 

నేటి నుంచి నిర్వహించే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను బాగా  కట్టుదిట్టం చేయడం జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాటకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. మావోలను కట్టడి చేయడానికి గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు పోలీసులు చేపడుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: