నా ఏటీఎం పనిచేయడం లేదు. ఏటిఎం నుంచి డబ్బులు రావడం లేదు అంటూ, మొన్నటివరకు బాగానే పనిచేసింది, ఇప్పుడేమైంది అని ఏడుపు ముఖాలు పెట్టకండి. ఎందుకంటే జనవరి ఫస్ట్ తర్వాత చాలామంది నోట ఇలాంటి మాటలు వినిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటారా? ఏటీఎం చిప్ కార్డు తీసుకోకపోవడమే ఇలాంటి మాటలకు కారణం. అలాంటి ఇబ్బందులు రావొద్దనుకుంటే బ్యాంక్ కస్టమర్లు వెంటనే అలర్ట్ కావాల్సిందే. ఇకపోతే డిసెంబర్ 31 దగ్గరకొస్తోంది. అర్జెంట్ గా మీరు బ్యాంకులకు వెళ్లాల్సిందే. లేదంటే జనవరి ఒకటి నుంచి మీ ఏటిఎం పనిచేయక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

 

ఇప్పటికీ ఇంకా పాత కార్డులే అంటే ఈఎంవీ చిప్ లేని కార్డులే ఉపయోగిస్తున్న కస్టమర్లు ఉన్నారు. వారు కొత్త కార్డులు తీసుకోకపోతే పాత కార్డులు పనిచేయవు. మరి మీరు ఇప్పటికీ మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ ఉన్న కార్డులే ఉపయోగిస్తున్నట్టైతే వాటిని వెంటనే ఈఎంవీ చిప్ కార్డులోకి మార్చుకోవాలి. ఇందుకోసం మీకు డిసెంబర్ 31 వరకే అవకాశం ఉంది. మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఓసారి చెక్ చేసుకొని, కార్డుపై ఈఎంవీ చిప్ లేకపోతే కొత్త కార్డు కోసం అప్లై చేయాలి.

 

 

ఇక ప్రస్తుతమున్న మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో చిప్ కార్డులు ఇస్తున్నాయి ఆయా బ్యాంకులు. ఒకవేళ వారిచ్చిన సమయము లోపు కొత్త చిప్ ఏటీఎం కార్డులు తీసుకోకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుపుతున్నారు.. ఇకపోతే మీరు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్ నుంచి ఈఎంవీ చిప్ కార్డుకు మారేందుకు ఎలాంటి ఫీజు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగానే కార్డులను అప్‌డేట్ చేస్తుంది.

 

 

ఇక వీటివల్ల ఉపయోగమేంటంటే ఇవి ఏటీఎం మోసాలు, సైబర్ చీటింగ్ అడ్డుకోవడానికి చిప్ ఉన్న కార్డులు ఉపయోగ పడతాయని. అందుకే bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఎస్‌బీఐ కస్టమర్లకు అందరికీ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఈఎంవీ చిప్ కార్డులను జారీ చేస్తోంది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ గతంలోనే ముగిసింది. కానీ ఇప్పటికే చిప్ లేని కార్డులు ఉపయోగిస్తున్నవారికి వాటిని మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది ఎస్‌బీఐ. సో... మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుకు ఈఎంవీ చిప్ లేకపోతే డిసెంబర్ 31 లోగా మార్చుకోండి. లేదంటే మీ యిష్టం..

మరింత సమాచారం తెలుసుకోండి: