ఈమధ్య జనాలు ఏదైనా చేయడానికి చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏదో మంచి పనులకు అనుకునేరు... చెత్త పనుల కోసమే కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఓ కూతురు అలాంటి ఆలోచనే చేసింది . నాన్న నా శవాన్ని తీసుకెళ్ళు అంటూ కొన్ని రోజుల కిందట కూతురు సూసైడ్ నోట్ రాసింది . కాగా ఈ సూసైడ్ నోట్ కలకలం రేపింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ కేసులో చివరికి ఓ పెద్ద ట్విస్ట్ తెరమీదకు వచ్చేసింది . ట్విస్ట్  తెరమీదకు రావడంతో అటు తల్లిదండ్రులు ఇటు పోలీసులు కూడా అవాక్కయ్యారు. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

 

 

వివరాల్లోకి వెళితే.... నిజాంబాద్ జిల్లా నబీపేట కు చెందిన ఓ విద్యార్థిని హిమాయత్ నగర్లోని ఓ బాలికల హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. నబీపేట కు చెందిన ఓ యువకుడు హిమాయత్నగర్ లోనే  బాయ్స్ హాస్టల్ లో ఉంటూ  డిగ్రీ చదువుతున్నాడు. ఇక ఇద్దరూ ఓకే కాలేజ్ ఓకే క్లాస్ రూమ్ లో చదువుతుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. కొన్ని రోజులపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎలాగోలా ఓ రోజు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇద్దరి ఇంట్లో వాళ్ళు  ఒప్పుకోరని వాళ్లకు వాళ్లే డిసైడ్ అయిపోయారు. 

 

 

 

 కొన్ని రోజులు ఎటైనా వెళ్లి వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు. అలా చేయడం వల్ల రెండు ఇళ్లలో కుటుంబీకులు ఫీలై వారిద్దరికీ పెళ్లి చేస్తారని అనుకున్నారు ఈ జంట. ఇంతలో ఆ యువతికి ఓ పనికిమాలిన ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియా  ప్రకారమే నవంబర్ 27న నా శవాన్ని తీసుకు వెళ్ళు నాన్న అంటూ ఓ సూసైడ్ నోట్ రాసి హాస్టల్ నుండి చెక్కేసింది. మరోవైపు అతను కూడా ఆ యువతితో చెక్కేసాడు. అయితే ఆ సూసైడ్ నోట్ చూసి యువతి తండ్రి ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు తండ్రి. చచ్చేంత దారుణ పరిస్థితులు తన కూతురుకు లేవని అసలు విషయం  బయటకు రావాలని వేడుకున్నారు . ఆ కుర్రాడికి బావమరిది వరసయ్యే... గుంటూరులో ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కి గుంటూరు చెక్కేసారు. అయితే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని ఆ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ టాప్ చేసారు. అయితే సూసైడ్ నోట్ రాసిన  అమ్మాయి గుంటూరులో ఉండడంతో అనుమానం వచ్చి హాస్టల్ లోని తన స్నేహితులుగా ఆరా తీయగా  అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో గుంటూరు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు బిగ్ బజార్ లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు . అయితే యువతి వేసిన ప్లాన్ కి అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: