దిశ ఉదంతం ఇప్పుడు దేశాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నది.  రోజురోజు మగువలపై అత్యాచారాలు అతికిరాతకంగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం.  2012లో నిర్భయ ఘటన తరువాత మరలా అలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చారు.  కానీ, ఆ చట్టం దారి చట్టానిదే... మృగాళ్ల దారి మృగాళ్లదే అన్నట్టుగా మారిపోయింది.  అందుకే కట్టడి చేయడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు.  


ఇప్పుడు ప్రియాంక కేసు దేశంలో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో నలుగురు నిందితులు దొరికారు.  వారిని కఠినంగా శిక్షించాలని యావత్ భారతదేశం నినాదాలు చేస్తున్నది.  కానీ, వాళ్ళను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్ లో మిగతా ఖైదీలను ఎవరిని కలవనివ్వకుండా ప్రత్యేకంగా ఉంచారు. ఉదయం పులిహార, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మటన్ కూరతో భోజనం పెట్టారు.  హాయిగా తిని నిద్రపోయారు.  


వారిలో తప్పుచేశామనే భయం కానీ, అలాంటి భావన కానీ కనిపించడడం లేదు.. ఏమోసార్ ఫుల్ గా తగున్నాం ఆ సమయంలో ఏం చేస్తున్నామో తెలియడం లేదు అని చెప్పడం వెనుక ఎంతటి నిర్లక్ష్యం ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  ఈ నిర్లక్ష్యాన్ని కారణం మద్యం.  దీనిపై పార్లమెంట్ లో ఈరోజు చర్చ జరుగుతున్నది.  ఈ ఉదయం రాజ్యసభలో దీనిపై చర్చకు పిలిచారు.  చర్చ జరుగుతున్నది.  ఇప్పటికే దీనిపై భారీ స్థాయిలో చర్చిస్తున్నారు.  


నిందితులకు నెలరోజుల లోపే శిక్ష విధించాలని అంటున్నారు. అయితే, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా దీనిపై స్పందించారు.  చట్టాలతో పాటు నిందితుల మైండ్ సెట్ కూడా మార్చాలని, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని, మైండ్ సెట్ మార్చినపుడే దేశంలో ఇలాంటి అరాచకాలు తగ్గిపోతాయని వెంకయ్యనాయుడు తెలిపారు.  అటు లోక్ సభలో కూడా ఈ మధ్యాహ్నం దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: