విజయశాంతిమొదట  కెసిఆర్  పార్టీ అయినా తెరాస లో ఉంది తర్వాత తల్లి తెలంగాణ అంటూ పార్టీ స్థాపించి మల్లి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటున్నారు నటి విజయశాంతి. ప్రియాంకారెడ్డి ఘటనపై  సీఎం కేసీఆర్‌పై మరోసారి  తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి.

 

హైదరాబాద్ లో జరిగిన ఘోరం గురించి   దేశంనలుమూలల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని ప్రతిపక్ష నేతలు వెళ్లి పలకరించిన సీఎం కెసిఆర్ నుండి ఎటువంటి స్పందన రాలేదు . కానీ సంఘటన జరిగిన  72 గంటలకు తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు విజయశాంతి .

 

హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస పార్టీ గెలిచినా విషయం కోసమై వెంటనే  పత్రిక విలేకరుల అందరిని పిలింపించి ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ గారు ... ఒక ఆడపిల్ల పైన  దారుణమైన ఘటన జరిగి  మరణం సంభవిస్తే  ఆ ఘటనఫై పై స్పందించడానికి మూడు రోజుల తరవాత తీరిక దొరికిందా అంటూ అయన ను ఎద్దేవా చేసారు ?  జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో కేసీఆర్ చేతులు దులుపుకొన్నారంటూ వ్యాఖ్యానించారు ,. దిశా మర్డర్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదన్నారు.

 

ఆర్టీసీకి ఆదుకుంటామని చెప్పిన సీఎం..హైకోర్టు తీర్పు వచ్చిన్నప్పుడు ఎందుకు  ఆ పని చేయలేదని కెసిఆర్ గారి ని  ప్రశ్నించారు. సమ్మె సమయం లో ఆర్టీసీని కాపాడే నాధుడే లేడు అన్న కేసీఆర్... ఆర్టీసీని కాపాడేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? అంటూ అయన ను నిలదీశారు. ప్రగతి భవన్‌లో  పెంచుకునే పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ కూడా తెలంగాణ లో బ్రతుకుతున్న ప్రజలకు విలువ  ఇవ్వడం లేదు అంటూ  విజయశాంతి  కెసిఆర్  ఫై మండి పడ్డారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: