అక్టోబర్ నెలలో జరిగిన మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నో రాజకీయం పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసినదే. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని పోటీ చేసిన బీజేపీ, శివసేన ఇద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత బిజెపి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహాయంతో అకస్మాత్తుగా సీఎం అయ్యారు. కానీ, ఆ పదవి ముచ్చటగా మూడు రోజులు నిలబడింది. కేవలం 80 గంటల్లోనే మళ్లీ ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది.

 

 కానీ ఆ 80 గంటల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై బిజెపి ఎంపీ మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బిజెపి పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం మనకు తెలుసు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలు లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేశారనేది అందరికీ తెలుసునని ఆయన బాంబు పేల్చారు.

 

అసలు విషయం ఏమంటే కేంద్రం నుంచి మహారాష్ట్ర కి 40 కోట్లు వేల కోట్లు వచ్చాయి అనేసి చెబుతున్నారు. వాటిని దుర్వినియోగం కానివ్వకుండా ఫడ్నవిస్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ, కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ నిధులను దుర్వినియోగం అవుతోందని ఆయన భయపడ్డారు. దీని కోసం మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆ 40 వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు అని చెబుతున్నారు. 

 

మహారాష్ట్ర రాజకీయాలులో ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత  శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన విశ్వాస పరీక్షను కూడా నెగ్గారు. దీని పై ఫడ్నవీస్ స్పందిస్తూ ఈ వదంతులు అన్ని ఆధారం లేకుండా హెగ్డే నాపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: