ఆడది అంటే అలుసైపోయింది కొన్ని మానవ మృగాలకు.. మొన్న గురువారం శంషాబాద్ సమీపంలో జరిగిన ఘటన వింటే కన్నీళ్లు ఆగవు.. నాకన్నా చిన్న వయసు వారు.. నన్ను ఎం చేస్తారు.. తమ్ముడు లాంటి వాళ్ళు అనుకున్న అమాయిక అమ్మాయిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి సజీవదహనం చేసిన ఘటన ప్రజల మనసుని కలచివేసింది. 

        

ఈ ఘటనకు ఎం అని స్పందిస్తాం.. ఎలా స్పందిస్తాం.. అందుకే ప్రజలు కట్టలు తెంచుకున్న కోపంతో బాధతో ఆ నిందితులను నడిరోడ్డుపై నరికేయాలని జనాలు నిర్ణయించుకున్నారు. అందుకే ఆ నిందితులు ఉన్న చోటు వెళ్లి రచ్చ రచ్చ చేశారు కొన్ని వందల మంది నిరసనలు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు వారిని రక్షిస్తూ ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లారు. 

            

ఇంకా ఈ నిందుతుల కోసం ఈరోజు పార్లమెంటులో రచ్చ రచ్చ జరిగింది. భాదితురాలుకు ఎలా న్యాయం చెయ్యాలి.. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎన్నెన్నో పెరిగిపోతున్నాయి. కఠిన శిక్షలు వెయ్యటం లేదు. నిందితులను గాల్లోకి వదిలేస్తున్నారు. సంవత్సరాల పాటు నిందితులను పందులలా మేపుతున్నారని బాధితులకు ఏలాంటి న్యాయం జరగటం లేదని మహిళా ఎంపీలు కన్నీరు పెట్టుకున్నారు. 

        

ఈ దేశం మహిళలకు, చిన్నారులకు సురక్షితం కాదు. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్లే. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. దిశ హత్య కేసులో నలుగురిని డిసెంబరు 31లోగా ఉరి తీయాలి అని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్‌ చేశారు. అయితే ఈ మాటపై నెటిజన్లు.. ఇంకా ఉరి ఏంటి బాబు.. నడిరోడ్డుపై ఆ చెత్త నాకొడుకుల దాన్ని కోసేయండి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం అంతటా ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: