నాలుగు రోజుల క్రితం వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారం చేసిన ప్రాంతం ఇదేనా అంటూ జనాలు విపరీతంగా వస్తున్నారు. శంషాబాద్ ప్రాంతంలోని తొండుపల్లి టోల్ గేట్  దగ్గర దిశపై నలుగురు ముందు అత్యచారం చేసి తర్వాత హత్య చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం జరిగిన ప్రాంతానికి నిందుతులను   పోలీసులు తీసుకొచ్చి పరిశీలించారు.

 

పదే పదే పోలీసు అధికారులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించటంతో పాటు నిందుతులను కూడా తీసుకొచ్చి తాము ఎక్కడేమేమి చేయించారనే విషయాన్ని చెప్పించారు. ముందు పోలీసు అధికారులు తర్వాత నిందుతులు వరుసగా ఒకటే ప్రాంతానికి వస్తున్న విషయాన్ని జనాలు గమనించారు. దాంతో దిశపై నిందుతులు అత్యాచారం చేసింది ఇక్కడే అనే విషయం జనాల్లోకి బాగా ప్రచారమైపోయింది.

 

ఎప్పుడైతే జనాల్లోకి ఆ విషయం ప్రచారం జరిగిపోయిందో అప్పటి నుండి చుట్టు పక్కల ప్రాంతాల నుండి జనాలు ఆ ప్రాంతానికి విపరీతంగా వస్తున్నారు. దాంతో ఆ ప్రాంతానికి వస్తున్న జనాలను నియంత్రించటం పోలీసులు కష్టంగా మారుతోంది. ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, దగ్గరలోని టోల్ గేట్ ప్లాజా  ఉన్నప్పటికీ దిశ మీద నలుగురు అత్యాచారం చేయటాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఒకవైపు నిందితులపై అంతులేని కసి అదే సమయంలో అన్యాయానికి గురైపోయిన దిశపై  సానుభూతి వెరసి రోజుకు కొన్ని వందల మంది అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతం  చివరకు ఇది ఓ ప్రముఖ సందర్శనీయ ప్రాంతంగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా తయారవుతోంది.

 

ఇపుడా ప్రాంతంలోకి జనాలు రాకుండా చూడటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైపోయింది. రేపు ఉత్తరోత్తరా విచారణలో భాగంగా నిపుణులు ఈ ప్రాంతానికి వచ్చి ఏవైనా ఆధారాలను సేకరించాలంటే అవకాశం లేకుండా పోతోందని పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రాంతానికి జనాలను రానీయకుండా నియంత్రిస్తే ఒక తలనొప్పి. అలాగని అనుమతిస్తే మరొ తలనొప్పిగా తయారైంది పోలీసుల పని.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: