తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్‌లో నవంబర్ 26వ తేదీన జరిగిన దిశ రేప్, హత్య సంఘటన అత్యంత క్రూరమైనది హృదయవిదారకమైనది . పోలీసులనిర్లక్ష్య ధోరణి వల్లే   ఈ సంఘటన  జరిగింది. దిశ ఘటనకు ముందు కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. ఆ ఘటనలో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇచ్చింది. కానీ ఉరిశిక్షను హైకోర్టు జీవితకాలం శిక్ష మర్చి  తీర్పు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

 

తల్లి ఒడిలో నుంచి తొమ్మిది నెలల పసికాదు ను  ఎత్తుకెళ్లి రేప్ చేసి, చంపిన  ఆ కిరాతకుడు కి  ఎందుకు ఉరిశిక్ష విధించకుండా ఆలస్యం  చేస్తున్నారు? ఆ దోషికి వెంటనే ఉరి  శిక్షఅమలు అయ్యేలా చూడాలని అందుకు  సభ చర్యలు తీసుకోవాలి. నిర్భయ ఘటన జరిగి, నిర్భయ చట్టం  వచ్చి కూడా  7 సంవత్సరాలు అయినా   దోషులకు ఉరిశిక్ష ఎందుకు  విధించడం లేదు అంటూ  రేవంత్ రెడ్డి ఆవేదన  వ్యక్తం చేశాడు.2016 నివేదిక ప్రకారం.. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో 4 వందలకుపైగా రేప్ కేసులు నమోదయ్యాయి ..

 

వారిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. నీ ప్రాంతం కానీ అయినా  రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అయితే తాను ప్రసంగాన్ని ముగిస్తాను.. మరో అవకాశం ఇవ్వాలని కోరారు..

 

రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మోదీ మన్ కీ బాత్‌లో చాలా విషయాలు అంటూ మొదలుపెట్టగానే మైక్ కట్ చేయడంతో  లికె సబ లో గందరగళం నెలకొన్నది. అనంతరం హైదరాబాద్ దిశ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారాన్ని వ్యక్తం చేశారు.  హైదరాబాద్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: