తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో దిశ హత్య మరియు అత్యాచారం ఘటన ఎవరు దేశంతోపాటు ప్రపంచ దేశాలకు భారతీయ దేశంపై మరియు భారతదేశంలో ఉండే ఆడవాళ్ళ పై జరుగుతున్న అకృత్యాలపై వస్తున్న వార్తలు విని చాలా దారుణమైన అభిప్రాయాలను భారతదేశంపై వారి దేశస్థులకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ కి సంబంధించిన మహిళలు భారతదేశం వెళ్తున్నారంటే వాళ్లకి చాలా విషయాలను తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని కుదిరితే ఆ దేశానికి వెళ్లకపోవడం మంచిది అన్నట్టుగా తెలియజేస్తూ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అదే విధంగా ఏకాంత ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు ఇలా అనేక సూచనలు భారతదేశానికి వెళ్ళే ఫారిన్ కంట్రీస్ అమ్మాయిలకు సదరు దేశ అధికారులు తెలియజేస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ విధంగా ప్రపంచ దేశాలలో భారత దేశం పై మరియు భారత దేశంలో మహిళలపై జరుగుతున్న ఘటనలపై వార్తలు విని వణికిపోతున్న ప్రపంచ దేశాలు చాలావరకు తమ దేశానికి చెందిన స్త్రీలు ఈ దేశంలో రాకుండా చేయడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్య కేసు గురించి పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో హైలెట్ అవుతున్నాయి.

 

పార్లమెంటులో ఆయన ఏమన్నారంటే..తెలంగాణలో దిశ హత్య వంటి ఘటనలు జరగడానికి విచక్షణా రహితంగా మద్యం విక్రయాలు ఒక ప్రదాన కారణమని పిసిసి అద్యక్షుడు ,నల్గొండ ఎమ్.పి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.లోక్ సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాలుసుప్రింకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా సాగుతున్నాయని అన్నారు. దిశ ఘటనలో కూడా మద్యమే ప్రదాన పాత్ర పోషించిందని ఆయన అన్నారు.దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభటో టిఆర్ఎస్ ఎమ్.పి బండ ప్రకాష్ మాట్లాడుతూ చట్టాలను సవరించి ఇలాంటి అకృత్యాలను నిరోదించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: