హైదరాబాద్ లో షాద్ నగర్ సమీపంలో జరిగిన యువ వైద్యు రాలిపై  జరిగిన గ్యాంగ్ రేప్, హత్య ఘటనపై నిరసనలు ఇంకా  దేశం అంతటా  వెల్లువెత్తుతున్నాయి . దిశ గ్యాంగ్ రేప్, హత్య కు సంబదించిన దోషులను తక్షణమే  కఠినంగా శిక్షించాలని వారిని ఉరి తియ్యాలని లేకపోతె తాను ఆత్మహత్య చేసుకుంటా అని ఓ విద్యార్ధి ఆత్మహత్య యత్నానికి పాలుపడ్డాడు .

 

 ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి 'దిశ' దోషులకు వెంటనే  ఉరి శిక్ష వెయ్యాలని లేదంటే సూసైడ్ చేసుకుంటా అని మూడంతస్తుల భవనం పైకి ఎక్కి  .దూకుతానని బెదిరించాడు.పోలీసులు ఎంత నచ్చ చేవూరు ప్రయత్నం చేసిన అత్యాచారం చేసి, కాల్చి చంపిన వారిని ఉరితీయాల్సిందేనని పట్టుబట్టాడు  రోహిత్. నిందితులను ఉరితీయకపోతే ఇక్కడ ఒక ప్రాణం కచ్చితంగా  పోతుందని హెచ్చరించిన అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమింపజేయటానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

 

ఐ హేట్ ఇండియా అంటూ గట్టిగ అరుస్తూ రోహిత్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ఆ హంతకులకు మరణ శిక్ష పడాల్సిందే ..మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం .ఇటువంటి దారుణమైన సోసిటీ లో నా మనం బ్రతుకుతున్నది ఇలాంటి సమాజం లో  బతకడానికి తనకు ఇష్టం లేదని చాలా ఆవేదనగా చెప్పాడు.స్థానికులు, పోలీసులు మొత్తానికి చాలా సేపు ప్రయత్నం తర్వాత , అతనికి నచ్చజెప్పి క్రిందికి దిగేవచ్చే లా చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో రోహిత్ కు కౌన్సిలింగ్ ఇచ్చి , తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.

 

దిశ అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపధ్యంలోనిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశం మొత్తం ముక్త కంఠంతో నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తుంది .నిర్భయ ఘటన జరిగి  7సంవత్సరాలు అయినా ఇంకా నేరస్తులకు శిక్ష పడలేదు .నేరం చేసిన వారికీ శిక్ష ఎందుకు వేయడం లేదు అంటూ ప్రశ్నించారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: