ఈ మాటలు ఒకరు కాదు..ఇద్దరు కాదు దేశ వ్యాప్తంగా కోట్ల మంది మహిళలు తీవ్ర ఆవేదన..  ఆగ్రహంతో అంటున్న మాటలు. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో ఆడవారిపై ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం మరచి ఉన్మాథులుగా పిచ్చిపట్టిన కృర మృగాళ్లు రెచ్చిపోతున్నారు.  పక్కా ప్లాన్ చేసి అన్యాయంగా వెటర్నరీ డాక్టర్ దిశను బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి మూకుమ్మడిగా దాడి చేసి అత్యాచారం చేసిన నలుగురు నింధితులను తక్షణమే ఉరి తీయాలని.. పబ్లిక్ గా దారుణమైన శిక్ష విధించాలని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రతిఒక్కరూ కోరుతున్నారు.  

 

ఈ రోజుల పార్లమెంట్ లో సైతం దిశ కు జరిగిన అన్యాయంపై ముక్త కంఠంతో నినదించారు. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. వాటిని సరైన సమయంలో అమలు పరిస్థితే నింధితులు మరోసారి అలాంటివి చేయకుండా ఉంటారని ఆయన అన్నారు.  ఇక దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

 

దేశంలో మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక చర్చ జరుగగా, సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్, తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు అని ఆమె అన్నారు. అన్నా డీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ మాట్లాడుతూ, కన్నీరు పెట్టుకున్నారు. భారతావని మహిళలకు, చిన్నారులకు క్షేమకరంగా లేదని అన్నారు. దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. లోక్ సభలో దిశ ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కేసులు సంవత్సరాల తరబడి సాగుతున్నాయని..దాంతో నేరాలు చేసేవారు భయం లేకుండా యథేచ్చగా తమ అకృత్యాలు కొనసాగిస్తున్నారని అన్నారు.

 

మరోవైపు దిశ హత్యాచార నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసును త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  నిందితులపై చార్జ్‌షీట్ రూపొందించాలని పోలీసులు భావిస్తున్నారు. భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా సాక్ష్యాలను సేకరిస్తున్నారు.  కోర్టులో నేరం కనుక రుజువైతే దిశ హత్యాచార కేసు నిందితులకు మరణశిక్ష పడడం ఖాయం అంటున్నారు.  ఇక దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, సామాజిక నేతలు, మహిళా సంఘాలు ఆడకూతురు బయటకు వస్తే చంపేస్తారా.. మమ్ముల్ని బతకనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: