నేను చెప్పే స్టోరీ సినిమా స్టోరీ లాగా  ఉన్న... ఇది నిజంగా జరిగిన కథ. కేరళలోని వాయినాడ్ లో  సుల్తాన్ బతేరీఅనే  ఏరియా ఉంది. అక్కడ అన్ని  ఇల్ల లాగానే గవర్నమెంట్ ఆసుపత్రి పక్కనే ఓ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఆ  ఇంట్లో ఉంటున్న వాళ్లు ఒక్కసారిగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళకి కారణం మాత్రం అర్థం కాలేదు.కాని తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ  ఇంట్లో కి బయట్నుంచి పాములు వస్తున్నాయి. మొదట ఒకటి రెండు పాములు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఇల్లు మొత్తం పాముల కొంపల మారిపోయింది. దీంతో ఈ ఫ్యామిలీ మొత్తం భయం గుప్పిట్లో  బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రయితే చాలు ఎటునుంచి ఏ పాము వస్తుందోనంటూ  భయపడి పోయింది ఆ  కుటుంబం. 

 


 తెల్లవారాక కూడా ఒక గది  నుంచి ఇంకొ గదికి  వెళ్లాలంటే జంకాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో బయట వరండాలో గార్డెన్లో ఇలా ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి పాములే . అంతేకాదండోయ్ చుట్టుపక్కల ఉండే పాములు ఎక్కువగా విషపూరితమైన పాములు కూడా ఉండేది. ఆ కుటుంబానికి రోజురోజుకు మనశ్శాంతి కరువయ్యింది. మూడు పాములు ఏకంగా ఇంటి లోకి వచ్చేసరికి కుటుంబం మొత్తం గజగజా వణికిపోయింది. రాను రాను పాముల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇంట్లో ఎక్కడ చూసిన పాములు పాములు. ఆ ఇల్లు మనుషులు  ఉండే ఇల్లు కాదు పాము ఉండే ఇల్లు అన్నట్లుగా తయారైపోయింది. దీంతో చేసేదేమీ లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఆ ఫ్యామిలీ. 

 


  ఎనిమిది నెలల కిందట  ఇంట్లో ఉండే మహిళ భర్త సతీష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఆయన బతికున్నప్పుడు ఇంట్లోకి వచ్చిన పాములను పట్టుకొని వెళ్లి బయట వదిలేసేవారు. ప్రస్తుతం ఆయన లేకపోవడంతో ఇల్లును  వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పాములు రావడానికి గల కారణం ఏంటో తెలుసా... ఎప్పుడో 17 ఏళ్ల కిందట 4 సెంట్ల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నది ఈ  ఫ్యామిలీ. ఆ తర్వాత పక్కనే ఉన్న పాత ఇంటిని కూల్చి  ఇళ్ళు విస్తీర్ణం పెంచుకున్నారు . అయితే ఈ ఫ్యామిలీ కూల్చిన ఇంట్లో ఓ పెద్ద పాములు పుట్ట ఉండేదట. ఇక ఇల్లు కట్టుకోవడానికి ఎప్పుడైతే నిర్మాణదారులు ఆ పుట్టను కూల్చేశారో అప్పటి నుండి పాముల  కలకలం మొదలైందట. రోజురోజుకు పాముల బెడద ఎక్కువైపోయిందట . దీని కోసం చాలా పూజలు చేసిందట కూడా ఆ  ఫ్యామిలీ. అంతేకాదండోయ్ ఈ పాముల బెడద ఈ  ఇంటిని తప్ప చుట్టుపక్కల మరి ఇంటికి  లేకపోవడం గమనార్హం . కాగా ప్రస్తుతం ఈ ఇంటిని వదిలిన ఈ ఫ్యామిలీ  ఫెయిర్లాండ్ లోని ఓ బందు ఇంట్లో తలదాచుకుంటున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: