డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ప్రస్తుతం పేరు మార్చారు లెండి. జస్టిస్ ఫర్ దిశా అని. ఎంత పేరు మారిస్తే ఏం ప్రయోజనం.. పేరు మార్పు కాదు న్యాయం కావాలి.. ఇలాంటి నీచపు ఘటనలు మరో ఆడపిల్లపై జరగకూడదు అంటే ఎం చెయ్యాలి.. నిందితులను నడిరోడ్డుపై ప్రజల మధ్యలో ఘోరాతి ఘోరంగా కోసి పారేయాలి. అప్పుడు కానీ భారత దేశంలో ఇలాంటి దారుణమైన ఘటనలు జరగవు.. 

 

కానీ మా భారత్ అంత దారుణం చెయ్యడానికి ఒప్పుకోదు.. నేరం రుజువైన సరే రిమాండ్ అంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ నీచులను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే జైలులో ఉదయం ఆ నిందితులకు పులిహోర పెట్టగా మధ్యాహ్నం ఆ నిందితులకు వేడి వేడి మటన్ బిర్యానీ పెట్టారట. ఎందుకు అంటే.. ఆ నిందితులు ఆదివారం జైలుకు వెళ్లారట అందుకే వారికీ ఆ మటన్ బిర్యానీ. 

 

ఒక మహిళను సామూహిక అత్యాచారం చేసి ఘోరాతి ఘోరంగా హత్య చేసి పెట్రోల్ పోసి ఇంట్లో వారు కూడా గుర్తు పట్టని విధంగా దహనం చేస్తే వారికీ రాజా మర్యాదలు చేస్తున్నారు. ఏంటి ఈ ఘోరం. ఇది నేటి భారతం. తప్పు రుజువైన సరే నీచులను పందులలా మేపుతాం తప్ప ఏ శిక్షలు వెయ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసిన వారికీ తప్పకుండ శిక్ష పడుతుంది అని అంటుంది న్యాయస్థానం.. కానీ ఎప్పుడు జరుగుతుంది న్యాయం. 

 

ఏడేళ్ల క్రితం నిర్భయ కేసు ఏ ఇంకా తేలలేదు. ఎనిమిదేళ్లలోకి పడుతుంది. అయినా ఆ నీచులను ప్రభుత్వ సొమ్ముతో పందిని మేపినట్టు మేపుతున్నారు. ఇంకా మన దిశకు ఎప్పుడు న్యాయం జరగాలి ? మన దిశా కేసు దశ ఎప్పుడు మారాలి. మన భారతంలో పూజించేది ఆడవారినే కానీ హింసించేది కూడా ఆడవారినే. ఈ కేసు గురించి ఆలోచిస్తుంటే పిచ్చి పడుతుంది. ప్రజలు ఎంత ఆగ్రహించిన నిందితులకు ఎలాంటి శిక్ష పడదు. ఇది మన దేశ దౌర్బాగ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: