జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సమావేశంలో మాట్లాడుతూ నేను ఎన్నికల్లో ఓడిపోయినా నిలబడి ఉన్నానని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం కూడా మన మాట అంటే భయపడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్పు రావాలని కోరుకునే వాడికి భయం ఉండదని పవన్ అన్నారు. మన సమాజం తాలూఖు ఆడబిడ్డల మాన ప్రాణాలను సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 
 
రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలి అని పవన్ అన్నారు. నేను ఒక సమస్యను పట్టుకున్నానంటే పది సంవత్సరాలు అయినా మాట్లాడతానని పవన్ అన్నారు. ఏడుకొండలకు మాత్రమే వైసీపీ రంగులు వేయలేదని మిగతా అంతటా వేశారని పవన్ అన్నారు. శబరిమల వివాదం గురించి స్పందిస్తూ శబరిమల సాంప్రదాయాల్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఎలా పడితే అలా వాడకూడదని అన్నారు. 
 
తిరుపతిని గౌరవించాలి.. తిరుమలలో మతప్రచారం జరగకూడదనే దానిని నేను గౌరవిస్తానని పవన్ అన్నారు. ఏ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఆ ధర్మానికి ఇచ్చి తీరాలి అని పవన్ అన్నారు. సత్యాన్ని మాట్లాడేటపుడు రాజ్యాంగపరిధిలోనే మాట్లాడాలి అని పవన్ అన్నారు. అన్ని మతాల్లో గొప్పతనం ఉంటుందని అన్ని మతాలను సమానంగా గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేనెప్పుడూ వెనుకాడడని పవన్ అన్నారు. మతం మార్చుకుంటే అక్కడ కులం అనేది రాకూడదని పవన్ అన్నారు. క్రిస్టియానిటీలోకి వెళితే కులాలు రాకూడదని జగన్ ను ఉద్దేశించి పవన్ అన్నారు. నిజమైన మతవిశ్వాసం ఉంటే చెట్టుకు కూడా హాని చేయకూడదని పవన్ అన్నారు. జగన్ గారు మతం మారాక కులం ఎక్కడినుండి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి గారు మతం మారాక కులాన్ని వదిలేయాలని పవన్ అన్నారు. వైసీపీది రంగుల రాజ్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: