హైదరాబాద్ షాద్నగర్ దిశ అత్యాచారం హత్య ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది ఎట్టి పరిస్థితుల్లో అమాయకురాలైన వైద్యురాలు  దిశను  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పై దేశం మొత్తం రగిలిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్ష పడాలని అందరు డిమాండ్ చేస్తున్నారు. నేడు పార్లమెంటులో కూడా దిశ ఘటన పైన చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితిలో నిందితులను శిక్షించాలని పార్లమెంటులో ఎంపీలు చర్చించారు . చట్టాలను మార్చాలని నిందితులను  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం ఆగకపోవడంతో దారుణమని రాజ్యసభలో ఎంపీలు తెలిపారు. 

 

 

 

 కాగా ఈ సందర్బంగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దిశ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు. ఈ సందర్భంగా ధర్నాలో  కాంగ్రెస్ ఎంపీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా కూడా హాజరై దిశ రేప్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అటు దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరు షాద్నగర్ దిశా రేప్ ఘటనపై స్పందిస్తూ బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

 

 

 కాగా  షాద్నగర్ దిశ ఘటనలో నిందితులను కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైలులో పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే నిందితులకు కఠిన శిక్షలు విధించకుండా రిమాండ్ కు తరలించడం ఏంటని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులను కఠినంగా శిక్షించకుండా  ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా వీ వాంట్   జస్టిస్...జస్టిస్  ఫర్ దిశ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంకొకసారి ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగకుండా  విశాఖపట్నంలో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది  దేశ ప్రజానీకం.

మరింత సమాచారం తెలుసుకోండి: