దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో మత కల్లోలాలు జరిగాయి. అప్పట్లో హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు  పెద్ద ఎత్తున సాగడం, చాలా మంది మరణించడం ఒక సంచలంగా మారింది. అయితే ఇపుడు ఏపీ, తెలంగాణాగా రెండూ విడిపోయాయి. చాలా కాలంగా  చూసుకుంటే హైదరాబాద్ సైతం ప్రశాంతంగా ఉంది. అభివ్రుధ్ధి వైపు అంతా ద్రుష్టి పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ పరిస్థితి చూస్తే  ఇంకా కూల్ గా ఉంటుంది. ఇక్కడ మతాల గొడవలు అసలు లేవు.

 

అయితే ఇపుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గిట్టని వర్గాలు తమ రాజకీయం కోసం మతాలను ముందుకు తీసుకువచ్చి రచ్చ చేస్తున్నాయని అంటున్నారు. కులాల కుంపట్లకు ఏపీ ప్రసిధ్ధి, దానికి మతం కూడా తోడు అయితే మారణ హోమమే. కానీ రాజకీయం కావాల్సిన వారికి ఇది పట్టడం లేదు. జగన్ని సీఎం గా తాము అంగీకరించమని కొంతమంది నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

 

జగన్ని రెడ్డి అంటున్నారు. ఆయన క్రిస్టియన్ అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. మధ్యలో ప్రాంతాలను కూడా తీసుకువస్తూ రాయలసీమ కోస్తా అంటూ విడదీస్తున్నారు. ఈ తరహా నాయకులు తేలికగా మాట్లాడుతున్న ఈ మాటలు జన సామాన్యంలోకి వేగంగా వెళ్ళిపోతున్నాయి. వాటి ప్రభావం, పర్యవసానాలు కూడా ఆలోచిచుకోకుండా నేతలు తరచూ కులం మతం ప్రస్తావన తేవవడం వల్ల ప్రశాంత రాష్ట్రంలో అశాంతి చెలరేగితే ఎవరు బాధ్యులు అన్న మాట గట్టింగా వినిపిస్తోంది.

 

ఇక జగన్ ఈ రోజు గుంటూర్లో మాట్లాడుతూ, తన మతం మానవత్వం అని, కులం ఇచ్చిన మాటను తప్పకపోవడం అని చెప్పుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అలా చెప్పుకునే స్థితికి రాజకీయాన్ని తీసుకువెళ్తున్న వారి వెకిలితనాన్ని జనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పదే పదే హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం అంటూ దుమారం రేపుతున్నారు.

 

నిజానికి ఉమ్మడి ఏపీలో క్రిస్టియన్ ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నారు. కొత్త కూడా కాదు, మనది లౌకిక రాజ్యం. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఏ మత విశ్వాసమైన ఉండవచ్చు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు క్రిస్టియ‌న్లుగానే ఉంటూ సీఎంలుగా పాలించారు. మరి నాడు రాని ఈ మత వివాదాలు, గొడవలు నేడు ఎందుకు వస్తున్నాయో అంతా గమనించల‌ని కూడా వైసీపీ నేతలు సూచిస్తున్నారు.

 

శ్రీయేసయ్య నమః' అని తిరుమల తిరుపతి దేవస్థానం వారి 2020 క్యాలెండర్‌లో పేర్కొన్నార‌ని... టీటీడీ వెబ్‌సైట్ సాక్షిగా అన్యమత ప్రచారం జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే.  'శ్రీ ఐ నమః.... శ్రీ వేంకటేశాయనమః' అని ఉండాల్సినచోట... 'శ్రీయేసయ్యః శ్రీవేంకటేశాయనమః' అని ఉండ‌టం వ్యవహారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

 

 దీని మీద వివరణ ఇచ్చిన ఆలయ కార్యనిర్వహణాధికారి సింఘాల్ మాట్లాడుతూ,  ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని....ఇదే రీతిలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్‌సైట్లో లేదని, గూగుల్‌ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని వెల్ల‌డించారు. దీని మీద గూగుల్ కి ఫిర్యాదు చేశామని , వివరణ్ కూడా కోరామని చెప్పౌరు. 

 

ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిల్లర రాజకీయం చేయడం కోసం ఏపీలో మత కలహాలను సైతం రెచ్చగొట్టేలా కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు కూడా నిజాలు తెలుసుకోకుండా బాధ్యతారహితంగా రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. మొత్తానికి కుర్చీ కోసం జరుగుతున్న కుమ్ములాటలో మతాన్ని తెచ్చి చిచ్చు రేపితే రేపటి రోజున దానికి సంబంధించి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: