దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిషా ఘటన నిందితులను వారం రోజుల కస్టడీకీ ఇవ్వాలంటూ షాద్‌నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌కు కౌంటర్‌ వేయబోమని షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ తెలియజేసింది. దిశపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరోవైపు నిందితుల తరపున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ తీర్మానించింది.

 

తెలంగాణ నిర్భయ కేసును తరగతిన పూర్తి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కసరత్తులు ప్రారంభించారు.  ఇందులో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించి అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు,  ప్రత్యేక బృందాలు పని చేశాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. అయితే నిందితిలు చెప్పిన దాని ఆధారంగా పోలీసులు పూర్తి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఈ హత్య కేసును వేగంగా విచారించి , దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

 

దోషులకు కఠినంగా శిక్షపడేలా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల నేపధ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.  హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన  వెంటనే రోజువారీ పద్దతిలో విచారణ జరిపి,  నిందితులకు వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

మరోవైపు తెలంగాణ నిర్భయ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహ్మద్ అరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ నలుగురు నిందితులూ, తోడేళ్లలా ఆ యువతి మీద పడ్డారు. ఆ సమయంలో ప్రియాంక చేసిన ఆర్తనాదాలు, సహాయం కోసం చేసిన ఆక్రందనలు ఎవరి చెవులకు చేరలేదు. బలవంతంగా నోట్లో మద్యం పోసి..అరవకుండి నోరు మూసేసారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మాకర స్థితికి చేరుకున్న అమెను నోరు..ముక్కు మూసేసి చంపేసారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేయటంతో పాటుగా ఆమె ఫోన్ సిమ్ కార్డులూ మంటల్లో వేశారు. షాద్‌ నగర్ బ్రిడ్జి దగ్గర కిందకి దించే సమయంలో బతికి ఉందన్న అనుమానంతో వైద్యురాలిని దుండగులు కాల్చిచంపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: