హైదరాబాద్ షాద్నగర్ దిశా రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. నిందితులకు కఠిన శిక్షలు పడాలంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆడపిల్లలను రేప్  చేయగానే శిక్షపడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం వచ్చింది అంటూ దేశాశం మొత్తం నినదిస్తుంది . అయితే దిశా  సంఘటనపై జనసేనని పవన్ కళ్యాణ్  స్పందించారు. రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా ఘటన పై ఆవేశపూరితంగా స్పందించారు.  ఆడపిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేంతవరకు తమ్ముడు అన్నల గుండెలు ఎలా కొంటుకుంటాయో తనకు తెలుసనీ పవన్  కళ్యాణ్ అన్నారు ఎందుకంటే తాను కూడా ఆడ పిల్లల మధ్య పెరిగానని  పవన్ కళ్యాణ్ అన్నారు. 

 

 

 

 తను షూటింగ్ కి వెళ్ళినప్పుడు పొట్టకూటి కోసం వెయ్యి రెండు వేలు కోసం జూనియర్ ఆర్టిస్టులు ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చేవాళ్ళని  పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ వాళ్లను చూసి జనాలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక కర్ర పట్టుకుని వాళ్ళకి రక్షణగా నిలిచానని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తన కారును కూడా ఇచ్చి వారిని సురక్షితంగా పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ  ప్రభుత్వాన్ని గురించి కూడా ప్రస్తావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మన ఇంట్లో ఉన్న మహిళల ప్రాణాలను సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చినా ప్రయోజనం ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 

 

 టీవీల ముందు కూర్చుని బూతులు తిట్టడానికి మీరు ఉన్నది మా నాయకులు ఇలా ఉన్నారనే  జనాలు రోడ్లపైన బలత్కారాలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు  పవన్ కళ్యాణ్. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే గట్టిగా మాట్లాడితే మా నాయకులు ఇంత కచ్చితంగా ఉన్నారని అక్కడ జనాలు కూడా మానభంగాలు చేయకుండా ఉంటారు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ వీళ్ళు ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం వల్లే రాజకీయాలు ఇంత కుళ్ళిపోయి ఉంటాయి అని తెలిసి  తాము ఏదైనా చేయొచ్చు అని  రోడ్లపై దర్జాగా  తిరిగి అన్ని చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి నిందితులకు సింగపూర్ తరహా శిక్షలు విధించాలని అన్నారు. దేవతలు సైతం అభయహస్తం తోపాటు కత్తులు కటార్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే తప్పులు చేస్తే అడ్డంగా దండిస్తామని  హెచ్చరిక చేసేందుకే అంటు  జనసేనానీ  తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: