భారతదేశంలో ఎన్నో రోజులు నడిచిన కేసుల్లో అయోధ్య కేసు కూడా ఒకటి. అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై గత నెలలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద స్థలం హిందువులకు కేటాయించి, ముస్లింలకు అక్కడికి దగ్గర్లోనే ఐదు ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే మందిర నిర్మాణానికి ఒక కమిటీ వేయాలి అని కూడా సూచించింది . దేశ హోమ్ మంత్రి ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా తగిన భద్రత తీసుకోవడం వల్ల ఎటువంటి గొడవలు జరగలేదు.

 

 కానీ, ఇప్పుడు ఆ తీర్పు సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ సవాలు దాఖలయింది. జమైత్ ఉలేమా హింద్ అనే ముస్లిం సంస్థ సోమవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. ఆ సంస్థ చీఫ్ మౌలానా హర్షద్ మదనీ మాట్లాడుతూ దేశంలోని ఎక్కువ మంది ముస్లింలు అయోధ్య తీర్పు పై వ్యతిరేకంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయోధ్యపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.


అసలు అయోధ్య కేసులో హిందువుల మందిరాన్ని కూల్చి మసీదు పెట్టారనేది వివాదాస్పద అంశం. కానీ, దానికి సంబంధించి తగిన ఆధారాలు లేవు అని కోర్టు స్వయంగా చెప్పింది. దాని ప్రకారం చూసుకుంటే మాకు తీర్పుకు వ్యతిరేకంగా వచ్చింది అని ఆయన చెప్పారు. అందుకే మేము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నామని చెప్పారు.

 

 గత నెలలో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత దాఖలైన మొదటి రివ్యూ పిటిషన్ ఇదే. మరో ముస్లిం సంస్థ కూడా ఇలాంటి రివ్యూ పిటిషన్ వేయాలని ఆలోచనలో ఉంది. డిసెంబర్ 9న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పింది. ఇంకో విషయం, ఏమిటంటే ముస్లింల తరఫున వాదించిన సున్నీ వక్ఫ్ బోర్డు తమకు వచ్చిన అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వెయ్యమని ఇది వరకే స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: