దేశంలో రేపిస్టులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  మానవ సమాజంలోనే ఉంటూ.. మనుషుల రంగులను పూసుకొని మంచివాళ్ళుగా నటిస్తూ.. సమయం దొరికినపుడు కాటు వేస్తున్నారు.. ఇలా  కాటువేస్తున్న కాలనాగులను అంతమొందించాలని మహిళల మానప్రాణాలు కాపాడాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.  నిరసనలు తెలియజేస్తున్నారు.  రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.

 

 మొన్నటి రోజున షాద్ నగర్ పోలీస్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని నినాదాలు చేయడంతో నిందితులను రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు.  ఇక వాళ్ళను జైల్లో కూర్చోపెట్టి మేపుతున్న సంగతి తెలిసిందే.  


ఇక ఇదిలా ఉంటె, ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో స్పందించారు. తోడుంపల్లి టోల్ ప్లాజా వద్ద దిశపై జరిగిన అత్యాచార ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి మాట్లాడారు.ఇంటి నుంచి ఆడపిల్ల బయటకు వెళ్తే.. తిరిగి వచ్చే వరకు ఇంట్లో వుండే తల్లిదండ్రులు ఎంతగా ఎదురుచూస్తారో ఎంత భయంగా ఎదురు చూస్తారో తనకు తెలుసునని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  

 


ఇక తాను షూటింగ్ చేసే రోజుల్లో పాపం రూ. 1000, రూ. 2000 వేలకు షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చే మహిళా జూనియర్ ఆర్టిస్టులవైపు మగాళ్లు ఎలా చూస్తారో.. వారిని ఎంతగా ఏడిపించేవారో తనకు తెలుసునని పవన చెప్పారు.  ఒక్కోసారి తాను కర్రపట్టుకొని దగ్గర్నుంచి వాళ్ళను కాపాడానని అన్నారు.  తన కారు ఇచ్చి వాళ్ళను సురక్షితంగా పంపిన రోజులు ఉన్నాయని చెప్పారు.  

 


ఇకదిశ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఉరితీయాలని, తమకు అప్పగించాలని, తాము చూసుకుంటామని అన్నారు.  దిశను చంపినట్టుగానే ఆ నిందితులను కూడా చంపాలని డిమాండ్ చేస్తున్నారని, ఒక మనిషిని మనం చంపలేమని, అది చట్టం చేతుల్లో ఉందని అన్నారు.  అలానే అత్యాచారం చేసిన నిందితులను సింగపూర్ తరహాలోనే శిక్షించాలని అన్నారు.  బెత్తంతో చితకబాదాలని, తోలు ఊడేవరకు చితక కొట్టాలని పవన్ చెప్పారు.  మరి పవన్ చెప్పినట్టుగా ప్రస్తుతం జరుగుతుందా అంటే ఏమో చెప్పలేం. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నది.  కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: