దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉల్లి ఘాటు అందరికీ తగుల్తూ ఉంది. ఉల్లిని కట్ చేయకుండానే కన్నీళ్లు తెపిస్తుంది ఉల్లి పాయ. సాధారణంగా  కేజీ ఉల్లిపాయ ధర 15 నుంచి 30 రూపాయల మధ్యలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఈ ధర దాదాపు ప్రతి చోటా వంద రూపాయలు పైనే ఉండటం సామాన్యుల జోబుకి భారీగా చిల్లు పడుతుంది. వేసిన పంట సరిగా రాకపోవడం, అలాగే బాగా వర్షాలు పడి పంట మునిగిపోవడం వల్ల దిగుబడులు తగ్గి రేట్లు పెరగడానికి ముఖ్యకారణం అని తెలుస్తోంది. వివిధ, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ధరల్లో ఉల్లిపాయలను వినియోగదారులకు చేర వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, అవి ఎంతవరకు ఫలితాన్నిస్తాయి అనేది ఎవరికీ తెలియడం లేదు.

 

 తాజాగా ఉల్లిపాయలు కొన్ని ఊర్లలో దాదాపు కేజీకి 200 రూపాయలు దాటినట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బిజెపి ప్రభుత్వంకి ఇది ఒక సమస్యగా తయారవుతుందని చెప్పాలి. దీనికి తగు చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం టర్కీ ప్రభుత్వం తో ఒక ఒప్పందానికి వచ్చి 11,000 టన్నుల ఉల్లి దిగుమతి అనుమతి తీసుకుంది.

 

ఈ సరుకు భారతదేశానికి డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ముందే ఈజిప్టు ప్రభుత్వం తో 7 వేల టన్నుల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మరో పది రోజుల్లో భారతదేశానికి రావొచ్చు అనేసి తెలియచేస్తుంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం లక్షన్నర టన్నుల ఉల్లిపాయలు దిగుమతికి అనుమతి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసినదే.


ఈ దిగుమతులు మార్కెట్లోకి వస్తే ఉల్లి ధరలు కొద్ది మేర శాంతిచే అవకాశాలు ఉన్నాయి. కొంత మంది వ్యాపారస్తులు కావాలనే రేటు పెరగడానికి సరుకు నిల్వ చేస్తున్నారు. అక్కడ అక్కడ విజిలెన్స్ దాడులు కూడా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: