కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభలో మాట్లాడుతూ దిశ హత్య ఘటన చాలా బాధాకరం అని అన్నారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. దిశను అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కిషన్ రెడ్డి అన్నారు. అత్యాచార నిందితుల శిక్షకై చట్ట సవరణకు సిద్ధం అని కిషన్ రెడ్డి అన్నారు. 
 
ఐపీసీ, సీఆర్సీపీని సవరిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. దిశ అమాయకురాలని సర్వీస్, డ్యూటీ మైండెడ్ అని కిషన్ రెడ్డి అన్నారు. దిశ ఘటన చాలా గంభీరమైన ఘటన అని అన్నారు. భాషలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా దేశమంతా ఈ ఘటనను ఖండించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఐపీసీ, సీఆర్సీపీ డ్రాఫ్ట్ లను కూడా సిద్ధం చేశామన్నారు. నిర్భయ కేసులో కనీసం మృతదేహం దొరికిందని కానీ దిశ ఘటన భయంకరమైన సంఘటన అని కిషన్ రెడ్డి అన్నారు. 
 
ప్రభుత్వం అత్యాచార నిందితులను శిక్షించటం కొరకు కఠిన చట్టం తయారీకి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం మహిళల అంశంలో ప్రాసిక్యూషన్, ఇన్వెస్టిగేషన్ కు సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదం విషయంలో ఏ విధంగా పని చేస్తున్నామో అదే విధంగా నిందితులను శిక్షిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. 
 
ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు పోలీసులను అప్రమత్తం చేసే విధంగా సమీకృత నంబరును ఇచ్చామని కిషన్ రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు 112 నంబరుకు ఫోన్ చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసును పార్లమెంట్ ఉభయ సభలు ఖండించాయి. మరోవైపు దిశ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: