రాష్ట్రంలో వైసీపీ పాల‌న చేప‌ట్టి ఆరు మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో సీఎంగా జ‌గ‌న్ పాల‌నాశైలిపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. వీటిలో పొగ‌డ్త‌లు ప‌క్క‌న పెడితే.. ఒకింత ఆలోచ‌నాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారే రెండు కీల‌క విష‌యాల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. ఒక‌టి.. రాష్ట్ర అభి వృద్ధికి ప్ర‌ణాళిక‌లు. రెండు మ‌త ప్ర‌చారం జ‌రుగుతోంద‌నే తీవ్ర విమ‌ర్శ‌లు. ప్ర‌స్తుతం తొలి విష‌యం గురిం చి చ‌ర్చించుకుంటే.. జ‌గ‌న్ పాల‌న మొత్తం కూడా సంక్షేమం దిశ‌గానే సాగుతోంది. పాద‌యాత్ర‌లో తాను ఇచ్చిన హామీల మేర‌కు జ‌గ‌న్ సంక్షేమానికి పెద్ద‌పీట వేశారు.

 

అడిగిన‌, అడ‌గ‌ని వారికి కూడా ప్ర‌భుత్వం నుంచి ఏదో ఒక రూపంలో ల‌బ్ధి చేకూరుస్తున్నారు. ప‌థ‌కాలు ఏవై నా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు చేరుతున్నాయి. వీటిని మ‌రింత‌గా పెంచుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ల‌బ్ధి పొందుతున్న ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ రేటింగ్ అమాంతం పెరిగినా.. ఇవి మున్ముందు రాష్ట్ర ఖ‌జానాకు ఇబ్బంది తెచ్చిపెడ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదనేది విశ్లేష‌కుల మాట‌. ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం గ‌త చంద్ర‌బాబు ఖ‌జానాను ఊడ్చేశారు. పైగా 80 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ప్ర‌స్తుతం వీటి కి వ‌డ్డీలు కూడా భారీగానే క‌డుతున్నారు.

 

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎత్తుకున్న సంక్షేమం మ‌రింత‌గా కుంగ‌దీస్తుంద‌ని చెబుతున్నారు. అదేస‌మ యంలో రాష్ట్ర అభివృద్ది, ఆదాయ వ‌న‌రుల విష‌యంలో జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వ్యూహం ప్ర‌ద‌ర్శిం చ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయాల్సి న అవ‌స‌రం ఉంది. ఇక‌, రెండోది అత్యంత కీల‌క‌మైంది. కొన్ని నెల‌లుగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌తం తాలూ కు మ‌ర‌క‌లు అంటించేలా ఓ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు. అయితే, ఈ విష‌యంలో వ్యూహాత్మ కంగా చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌భుత్వంపై ఎలాంటి మ‌ర‌క‌లు చూడాల్సిన ప్ర‌భుత్వం మిన్న‌కుంటోంది.

 

ముఖ్యంగా ప‌లు ఆల‌యాల్లో హిందూయేత‌ర మ‌తానికి చెందిన ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఇక‌, ఈ విష‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మ‌రింత‌గా విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. టీటీడీలో అన్య‌మ‌తస్తులు ప‌నిచేస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో వివాదం ఉంది. వీరిని తొల‌గించే చ‌ర్య‌లు ఇప్ప‌టికీ తీ సుకోలేదు. పైగా ఇటీవ‌ల రెండు రోజులుగా టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీఏస‌య్య అని రాసిన వాక్యం క‌నిపించ డం ఈ వివాదాన్ని మ‌రింత‌గా పెంచింది. ఇక‌, పాస్ట‌ర్ల‌కు మౌజ‌న్లకు జ‌గ‌న్ జీతాలు ఇవ్వ‌డం కూడా హిందూ వ‌ర్గం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ రెండు విష‌యాలు జ‌గ‌న్‌కు మైన‌స్‌గా మారాయ‌ని అంటు న్నారు. మ‌రి వీటిని ఎలా ?  స‌రిచేస్తారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: