ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ ఫైట్  జరుగుతోంది. దీనిపై కొద్ది రోజులుగా అధికార వైసీపీ... జనసేన మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సీఎం  జగన్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్.. జగన్ రెడ్డి అంటూ సంబోధించటంపై మంత్రులు మండిపడుతున్నారు. మరోవైపు...తన కులంపైనా సీఎం జగన్ ఈ రోజు ఓ క్లారిటీ ఇచ్చారు. 

 

రాష్ట్రంలో కొందరు నాయకులు తన కులం... మతం గురించి మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. తన మతం  మానవత్వం అని తెలిపారు. తన కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పారు జగన్. ఇక...రాష్ట్రంలో ప్రజలను కులాలవారీగా విభజించి పాలించటం సరికాదని అన్నారు పవన్ కల్యాణ్. అందరినీ సమదృష్టితో చూసినపుడే తాను జగన్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పిలుస్తానని తెలిపారు.  

 

మరోవైపు...జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎక్కడికి  వెళ్తే అక్కడికి హచ్ కుక్క లాగా ఫాలో అవుతాడు పవన్ నాయుడు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పవన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు పిలవకపోతే జగన్ ముఖ్యమంత్రి కాదా అంటూ నిలదీశారు. 26న కడప స్టీల్ ప్లాంటుకు  శంకుస్థాపన చేస్తున్న విషయం పేపర్లు చూస్తే తెలుస్తుందని అన్నారు. ఐదేళ్లుగా జనం నిన్ను చూస్తూనే ఉన్నారని ఎంత మంది తాట తీశావో  అందరికీ తెలుసు అంటూ అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ పై మాటల తూటాలు పేల్చారు. మొత్తానికి...కులాలపై నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జనానికి మాత్రం వింతగా అనిపిస్తున్నాయి. అయితే .. ఈ కులాల ఎపిసోడ్ కు  ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందనేది మాత్రం ఇంకా తేలటం లేదు. సీఎం  జగన్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్.. జగన్ రెడ్డి అంటూ సంబోధించటంపై మంత్రులు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: