రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అనూహ్య‌మైన ప‌థ‌కాలు చేప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఏదొ ఒక రూపంలో ల‌బ్ది పొందేలా ఆయ‌న రూప‌క‌ల్ప‌న చేశారు. ఆరోగ్య శ్రీ నుంచి అమ్మ ఒడి వ‌ర‌కు ఇళ్లు, రేష‌న్ కార్డులు, పింఛ‌న్లు, భ‌రోసాలు, వేత‌నాలు ఇలా ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచే కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, దీనిని జాతీయ మీడియా తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతోంది. ప్ర‌స్తు తం ఆర్ధికంగా రాష్ట్రం పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. విభ‌జ‌న క‌ష్టాల్లోనే ఇంకా కూరుక‌పోయేలా  వ్య‌వ‌హ‌రిస్తే.. మున్ముందు మ‌రిన్ని క‌ష్టాలు తప్పేలా లేవ‌ని జాతీయ మీడియాలోనే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

 

తాజాగా జ‌గ‌న్ పాల‌న ఆరు మాసాలు పూర్తి చేసుకుంది. ఈ ఆరు మాసాల్లోఆయ‌న అనేక ప‌థ‌కాల‌కు రూప‌క ల్ప‌న చేశారు. సంక్షేమం పేరిట ప్ర‌జ‌ల‌కు పందేరం చేస్తున్న నిధులు ప్ర‌భుత్వానికి భారంగా ప‌రిణమిస్తు న్నాయ‌నేది వాస్త‌వం. ఇప్ప‌టికే తొలి ఆరు మాసాలు నిండుతూనే ప్ర‌భుత్వం 25 వేల కోట్ల మేర‌కు అప్పు తీసుకుంద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇలాంటి అప్పులు సాధార‌ణం ఏమీ కావ‌ని కూడా చెబు తున్నారు.

 

నిజానికి అప్పులు చేయ‌కుండా ఏ ప్ర‌బుత్వ‌మూ మ‌న‌గ‌లిగే రోజులు కానిమాట వాస్త‌వ‌మే అయినా.. సంక్షేమం కోసం చేసే అప్పులు నిర‌ర్ధ‌క‌మే అవుతాయ‌నేది మేధావుల మాట‌. ఒక అప్పు చేయ‌డం ద్వారా ఉత్ప‌త్తి పెంచాల‌నేది ఆర్థిక వేత్త‌ల మాట‌. త‌ద్వారా వినియోగం పెరిగి.. అప్పు ఆర్జ‌న‌కు దారి తీసి అప్పును అప్పే తీర్చుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. కానీ, రాష్ట్రంలో జ‌గ‌న్ చేస్తున్న అప్పు కొంత సందేహాల‌కు దారితీస్తున్నాయి. ఉత్పాద‌క‌త లేని అప్పు, నిర‌ర్ధ‌కం తోపాటు భారీ భారానికి కూడా దారితీస్తుంది.

 

మ‌రోప‌క్క‌, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై క‌ర్ర‌పెత్త‌నం చేసేందుకు చూపిస్తున్న ఉత్సాహం .. ఆర్తికంగా ఆదుకునేందుకు క‌నీసం జీఎస్టీ ప‌న్నుల రూపంలో ప్ర‌స్తుతం మాద్యం కార‌ణంగా రాష్ట్రాలు న‌ష్ట పోతున్న దానిని ప‌రిహారంగా ఇచ్చేందుకు కూడా ముందుకు రాని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఏపీ వంటి కీల‌క‌మైన రాష్ట్రానికి అప్పుల కార‌ణంగా త్వ‌రలోనే రాష్ట్రం త‌మిళ‌నాడు త‌ర‌హాలో అప్పుల్లో కూరుకుపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ వ్యూహం ఏంటో వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: