షాద్నగర్ వైద్యురాలు దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దిశా కేసులో  నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశం ప్రజానీకం నిరసనలు  తెలుపుతుంది . ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంది  దేశ ప్రజానీకం. అయితే షాద్నగర్ వైద్యురాలు దిశ హత్యాచారం హత్యా ఘటనపై  తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దిశ చివరి నిమిషంలో భయంగా ఉంది అంటూ తన చెల్లికి ఫోన్ చేయగ...  దిశ తన చెల్లికి ఫోన్ చేసే బదులు పోలీసులకు ఫోన్ చేయాల్సింది అంటూ హోంమంత్రి మహ్మద్ అలీ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి . రాష్ట్ర హోం మంత్రి పదవిలో ఉండి బాధితురాలిదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు అంటు దిశా  పేరెంట్స్ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు మహమ్మద్ అలీ  వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

 


 ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో మళ్లీ స్పందించిన హోం మంత్రి మహమ్మద్ అలీ... తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.దిశా  తన కూతురు లాంటిదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ అలీ డమ్మీ  హోంమంత్రి అంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. అలాంటి నేతలను క్యాబినెట్ లో ఎందుకు చేర్చుకున్నారు అంటూ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. దిశా  కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాం అంటూ కేటీఆర్ చెబుతున్నారంటే హోంమంత్రి డమ్మిన... లేదంటే ఇదేమన్నా రాచరికమా... అలాంటప్పుడు కేబినెట్లో డమ్మీని  ఎందుకు పెట్టుకున్నారు అంటు  ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. 

 

 కెసిఆర్ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ... కెసిఆర్ కు కనీసం క్యాబినెట్ సమావేశం నిర్వహించే  తీరిక లేదా అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు . ఈ సందర్భంగా ఆర్టీసీ పై కేసీఆర్ తీసుకున్న  నిర్ణయం పై కూడా స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్టిసి విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. సమ్మె విరమించిన తర్వాత ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన  మీటింగ్ లో ఉన్న సోయి...  కేసీఆర్ కు సమ్మె కాలంలో ఏమైనది అంటూ  ప్రశ్నించారు . మొన్నటిదాకా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సమయంలో ఆర్టీసీ కార్మికుల పనికిరాని వాళ్ళని అన్న  ముఖ్యమంత్రి కేసీఆర్... మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్నారో  చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అటు 30 మంది ఆర్టీసీ కార్మికులు ఇటు 100 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవటానికి  ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమయ్యారని విరుచుకుపడ్డారు. ఇన్ని  ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు తానే సమస్యలు పరిష్కరించాననే  నీచ స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారు అంటూ  విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: